Site icon HashtagU Telugu

GT Force: 110కిమీ పరిధితో 4 ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల.. ధ‌ర కూడా త‌క్కువే..!

GT Force

GT Force

GT Force: మీరు సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే జిటి ఫోర్స్ (GT Force) తన కొత్త శ్రేణి హై, తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఢిల్లీలో ఈ కొత్త స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధర రూ.55,555 నుండి రూ.84,555 వరకు ఉంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ నాలుగు కొత్త స్కూటర్లను పరిచయం చేసింది. ఇందులో GT వేగాస్, GT Ryd Plus, GT Oneplus ప్రో,GT డ్రైవ్ ప్రో మోడల్స్ ఉన్నాయి. కళాశాల విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లేవారు, ఫ్రీలాన్స్ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త స్కూటర్లను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ స్కూటర్లు బలమైన పనితీరును ఇస్తాయని, పర్యావరణాన్ని మెరుగ్గా ఉంచడంలో కూడా సహాయపడతాయని కంపెనీ పేర్కొంది.

GT వెగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్లు

కొత్త GT వేగాస్ తక్కువ వేగంతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.55,555. ఈ స్కూటర్‌లో BLDC మోటార్, 1.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఇది 4-5 గంటల్లో సులభంగా ఛార్జ్ చేయబడుతుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ స్కూటర్ 70 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. దీని వేగం గంటకు 25 కిమీ. దీని లోడ్ సామర్థ్యం 150 కిలోలు. సీటు ఎత్తు 760 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ, బరువు 88 కిలోలు.

Also Read: AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం

GT Ryd Plus ఈవీ ఫీచ‌ర్లు

జిటి రైడ్ ప్లస్ కూడా తక్కువ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.65,555. ఇది 2.2 kWh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్కూటర్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు పరుగెత్తుతుంది. దీని గరిష్ట వేగం 25 kmph, లోడ్ కెపాసిటీ 160 kg. GT రైడ్ ప్లస్ సీటు ఎత్తు 680 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm, బరువు 90 కిలోలు.

We’re now on WhatsApp : Click to Join

జిటి వన్ ప్లస్ ప్రో

ఇది హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని గరిష్ట వేగం గంటకు 70 కి.మీ. దీని లోడ్ కెపాసిటీ 180 కిలోలు. ఈ స్కూటర్‌ని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు పరుగెత్తుతుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఈ స్కూటర్ 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 210mm, బరువు 80 కిలోలు.

GT డ్రైవ్ ప్రో

ఇది కంపెనీ అత్యధిక వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది శక్తివంతమైన BLDC మోటార్, 2.5 kWh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీ. దీని లోడ్ కెపాసిటీ 180 కిలోలు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 200mm, బరువు 85 కిలోలు. ఈ స్కూటర్ ఎక్స్-షో రూమ్ ధర రూ.84,555.