Site icon HashtagU Telugu

Fast Tag : ఫాస్టాగ్ కు గుడ్‌బై, ఇక జీపీఎస్ చార్జీలు

Fast Tag Toll Plaza

Fast Tag Toll Plaza

కేంద్ర ప్ర‌భుత్వం ఫాస్టాగ్ వ్య‌వ‌స్థ‌కు ముగింపు ప‌ల‌క‌బోతోంది. టోల్‌గేట్ల వ‌ద్ద ఛార్జీల వ‌సూలుకు కొత్త ప‌ద్ధ‌తిని ఆచ‌రించ‌బోతోంది. GPS శాటిలైట్‌ టెక్నాలజీని ఉపయోగించి టోల్ ఛార్జీలు వసూలు చేయాలని కేంద్ర ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఒక టోల్ గేట్ నుంచి మ‌రో టోల్ గేట్‌కు ఛార్జీలు వ‌సూలు చేస్తున్నారు.కొత్త సాంకేతిక‌త అందుబాటులోకి వ‌స్తే జాతీయ ర‌హ‌దారుల‌పై ఒక వాహ‌నం ఎన్ని కిలోమీట‌ర్లు ప్ర‌యాణించిందో గ‌మ‌నించి దాని ఆధారంగా టోల్ ఛార్జీని వ‌సూలు చేస్తారు. ఏడాదిలోగా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా బూత్‌లను ప్రభుత్వం తొలగించనున్నట్లు మార్చిలో జ‌రిగిన లోక్ స‌భ స‌మావేశాల్లో మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌క‌టించారు. కొత్త పద్దతిలో కదులుతున్న వాహ‌నాన్ని GPS ఇమేజెస్ స‌హాయంతో ఛార్జీలను వసూలు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు.