Site icon HashtagU Telugu

Bajaj Pulsar: ఆకట్టుకుంటున్న కొత్త వర్షన్ పల్సర్ బైక్స్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Mixcollage 21 Jun 2024 12 42 Pm 2505

Mixcollage 21 Jun 2024 12 42 Pm 2505

ప్రస్తుత రోజుల్లో భారత్ లో యువత ఎక్కువగా ఇష్టపడుతున్న బైక్స్ లో పల్సర్ బైక్ కూడా ఒకటి. ఈ పల్సర్ బైక్స్ చూడటానికి లుక్ కూడా బాగుంటుంది అని చాలామంది ఈ బైక్ ను కొనడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. చాలా ఏళ్లుగా పల్సర్ బైక్స్ యువతను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బజాజ్ ఆటో ఇటీవల భారత మార్కెట్‌లో విక్రయిస్తున్న పల్సర్ మోడల్ లైనపు నవీకరించే పనిలో ఉంది. అయితే ఇందులో భాగంగా భారత వినియోగదారుల కోసం పల్సర్ 125, 150, 220 ఎఫ్‌ మోడల్స్ సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్లను రిలీజ్ చేసింది.

మరి ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు అనేక అత్యాధునిక ఫీచర్లతో ఈ బైక్స్ లాంచ్ చేసింది. అలాగే బజాజ్ పల్సర్ ఎన్ 160ను వీటితో పాటు రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ బైక్ ధర విషయానికి వస్తే ఈ బైక్‌ను రూ. 1.39 లక్షలకు భారతదేశంలో లాంచ్ చేసింది. ఇకపోతే ఈ బైక్ కీ సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. పల్సర్ 125 కార్బన్ ఫైబర్ సింగిల్, సిట్ సీట్ వేరియంట్లు బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతిచ్చే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ ఛార్జర్‌తో అప్‌డేట్ చేశారు. అలాగే పల్సర్ 150 వేరియంట్లలో ఇలాంటి మార్పులను చేశారు.

ఈ నవీకరణల తర్వాత పల్సర్ 125 కార్బన్ ఫైబర్ సింగిల్-సీట్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 92,883 వద్ద విక్రయిస్తున్నారు. అలాగే పల్సర్ 150 సింగిల్ డిస్క్ రూ. 1.13 లక్షలు కాగా, పల్సర్ 220 ఎఫ్ ధర రూ. 1.41 లక్షలుగా ఉంది. ఇకపోతే ఇందులో బజాజ్ పల్సర్ ఎన్ 160 వెర్షన్ విషయానికి వస్తే.. ఈ బైక్ ఇతర వేరియంట్లతో పాటు విక్రయిస్తున్నారు. అయితే ఈ బైక్‌లో కూడా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా నియంత్రించే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు కూడా ఆకట్టుకుంటాయి. అదనంగా రైడర్లు రైడింగ్ సౌకర్యవంతంగా చేయడానికి అధునాతన కనెక్టివిటీ ఫీచర్లు ఈ బైక్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. ఈ బైక్‌లో తాజా షాంపైన్ గోల్డ్ 33 ఎంఎం యూఎస్‌డీ ఫోర్క్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ బైక్ 164.82 సీసీ ఆయిల్- కూల్డ్ ఇంజన్‌తో 15.78 బీహెచ్‌పీ శక్తిని, 14.65 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.