సాధారణంగా చాలామంది కారులో ఏ చిన్న రిపేరు వచ్చినా కూడా వెంటనే సర్వీసింగ్ కి ఇస్తూ ఉంటారు. ఇలా కారు టైమ్ కి సర్వీస్ ఇవ్వడం కూడా చాలా మంచిది. అయితే కొంతమంది వారి బిజి షెడ్యూల్ వల్ల సర్వీసింగ్ సెంటర్ కి కాకుండా దగ్గర్లో ఉన్న సర్వీసింగ్ చేస్తూ ఉంటారు. అయితే అలా లోకల్ మెకానిక్ తో కార్ సర్వీసింగ్ చేయిస్తున్నప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కారు లోకల్ మెకానిక్ తో సర్వీస్ చేయించినప్పుడు ఇంజన్ ఆయిల్ సరైనది ఉపయోగించాడా లేదా అని చెక్ చేసుకోవాలి.
ఎందుకంటే కొన్నిసార్లు మెకానిక్ డబ్బు ఆదా చేయడం కోసం తక్కువ ఉన్న ఇంజన్ ఆయిల్ ఉపయోగించడం వల్ల కారు ఇంజిన్ త్వరగా పాడవుతుంది. కాబట్టి లోకల్ లో సర్వీస్ చేయించుకున్నప్పుడు మీరు దగ్గర ఉండి ఆ కారు కంపెనీకి సంబంధించిన ఇంజిన్ ఆయిల్ ను నింపమని చెప్పడం మంచిది. అలాగే ఆయిల్ మాదిరిగానే బ్రేక్ ఆయిల్ కూడా కారులో వాడుతారు. కార్ సర్వీసింగ్ చేసినప్పుడు బ్రేక్ ఆయిల్ లెవెల్ కూడా చెక్ చేయాలి. ఒకవేళ ఆయిల్ తక్కువగా ఉంటే దానిని టాప్ అప్ చేయండి. ఇంజన్ ఆయిల్ మాదిరిగానే బ్రేక్ ఆయిల్ కూడా కంపెనీది వాడమని సూచించాలి.
ఇక లోకల్ మెకానిక్ తో కార్ సర్వీస్ చేస్తున్నప్పుడు సస్పెన్షన్ కూడా చెక్ చేయాలి. ఎందుకంటే కార్స్ సస్పెన్షన్ లో సమస్య ఉంటే కారు నడపడం కష్టం అవుతుంది. చాలామంది చేసే పొరపాటు సర్వీసింగ్ కి ఇచ్చినప్పుడు కార్ సస్పెన్షన్ ను చెక్ చేయకపోవడం. ఈ విధంగా చేయడం వల్ల కారు త్వరగా పాడే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కసారి సస్పెన్షన్ ఫెయిల్ అయితే దాని రిపేర్ ఖర్చు చాలా పెద్ద మొత్తంలో అవుతుంది.