Hyundai Cars: దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai Cars) మోటార్ ఇండియా జూలైలో కొన్ని మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. కొరియన్ ఆటో దిగ్గజం బెనిఫిట్ స్కీమ్ కోసం అర్హత పొందిన మోడల్‌ల జాబితాలో మొత్తం 6 మోడల్‌లను చేర్చింది. వీటిలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఐ20 ఎన్ లైన్, ఆరా, అల్కాజర్, కోనా EV ఉన్నాయి. అదే సమయంలో కార్‌మేకర్ క్రెటా, వెన్యూ, వెర్నా, టక్సన్, ఐయోనిక్ 5 వంటి అత్యధికంగా అమ్ముడైన మోడళ్లపై ఎటువంటి తగ్గింపును అందించడం లేదు. మనం ఇప్పుడు ఈ తగ్గింపు ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
కొరియన్ కార్‌మేకర్ దాని చిన్న హ్యాచ్‌బ్యాక్ స్పోర్ట్జ్ మాన్యువల్ వేరియంట్‌పై రూ. 38,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్లలో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. అదే సమయంలో ఈ హ్యాచ్‌బ్యాక్ అన్ని ఇతర వేరియంట్‌లు మొత్తం రూ. 33000 తగ్గింపుతో వస్తాయి. అయితే, AMT గేర్‌బాక్స్ వేరియంట్ 13,000 రూపాయల ప్రయోజనాల ప్యాకేజీతో అందించబడుతుంది.
హ్యుందాయ్ i20, i20 N లైన్
హ్యుందాయ్ i20, i20 N లైన్ మోడళ్లపై అదే తగ్గింపును అందిస్తోంది. ఈ నెల రెండు మోడళ్లపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.10,000 కార్పొరేట్ తగ్గింపును అందజేస్తున్నారు. హ్యుందాయ్ దీనిని i20 N లైన్ మోడల్, DCT గేర్‌బాక్స్ వేరియంట్‌కు మాత్రమే విస్తరించింది.
Also Read: Google People Card : గూగుల్ పీపుల్ కార్డ్.. మీ గురించి మీరు చెప్పుకోవడానికి..
హ్యుందాయ్ ఆరా
హ్యుందాయ్ ఆరా సబ్-కాంపాక్ట్ సెడాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులు రూ. 33,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. ఆరా సిఎన్‌జిపై పెట్రోల్‌తో పాటు 20 వేల రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది.
హ్యుందాయ్ కోనా EV
భారతదేశంలోని కొరియన్ కార్ల తయారీదారు మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు జూలైలో అన్ని హ్యుందాయ్ కార్లలో అత్యధిక తగ్గింపును పొందుతోంది. కోనా ఎలక్ట్రిక్ SUV రూ. 1 లక్ష ఫ్లాట్ క్యాష్ తగ్గింపుతో లభిస్తుంది. ఎలక్ట్రిక్ SUV అన్ని వేరియంట్లపై ఈ తగ్గింపు వర్తిస్తుంది. హ్యుందాయ్ కోనా EV భారతదేశంలో ఇంత భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ వాహనం. అదే సమయంలో, హ్యుందాయ్ ఐయోనిక్‌పై ఎటువంటి తగ్గింపు ఇవ్వలేదు.