Harsh Goenka Vs Ola Boss : ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. ఆ కంపెనీ అందించే సేవల్లో లోపాలు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదులకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని, దీనిపై 15 రోజుల్లోగా ప్రతిస్పందించాలని ఓలాకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో తలెత్తుతున్న సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించడంలో సర్వీస్ సెంటర్లు విఫలమయ్యాయంటూ ఇటీవలే ప్రముఖ కమేడియన్ కునాల్ కమ్రా ఓ ట్వీట్ చేశారు. దానికి ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ ఘాటుగా బదులివ్వడంతో.. ఇద్దరి మధ్య వరుస ట్వీట్లతో పెద్ద వాగ్యుద్ధమే జరిగింది. తాజాగా ఇదే అంశంపై ఆర్పీజీ గ్రూపు ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka Vs Ola Boss) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ఓలా స్కూటర్లలోని లోపాలు, సర్వీసు సెంటర్ల వైఫల్యాన్ని అద్దంపట్టేలా ఆయన ఆసక్తికర వ్యాఖ్యను చేశారు.
Also Read :Scrap Vehicles : మన దేశంలో తుక్కు వాహనాలు ఎన్నో తెలుసా ?
‘‘నేను తక్కువ దూరం ప్రయాణించడానికే ఓలా స్కూటర్‌ను వాడుతుంటాను. ఒక కమ్రా (గది) నుంచి మరొక క్రమా (గది)కి ప్రయాణించాల్సి వస్తే ఓలాను ఉపయోగిస్తుంటాను’’ అని హర్ష్ గోయెంకా చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్‌లో కమ్రా అంటే రెండు అర్ధాలు ఉన్నాయి. కమ్రా అనే హిందీ పదానికి గది అనే అర్థం ఉంది. కమ్రా అంటే.. కమేడియన్ కునాల్ కమ్రా పేరు కూడా ఉంది. ఓలా స్కూటర్లలో సాంకేతిక లోపాలపై ఇటీవలే ఓలా సీఈవో భవీష్ అగర్వాల్‌ను ఎక్స్ వేదికగా కునాల్ కమ్రా నిలదీశారు.
Also Read :AP Liquor Tender : ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కన్స్యూమర్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో కన్స్యూమర్ హెల్ప్‌లైన్ పనిచేస్తుంటుంది. 2023 సెప్టెంబర్ నుంచి 2024 ఆగష్టు 30 మధ్య కాలంలో ఈ హెల్ప్‌లైన్‌కు ఓలా స్కూటర్ల పనితీరు సరిగ్గా లేదంటూ 10,644 కంప్లయింట్స్ వచ్చాయి. ఈ స్కూటర్ల సర్వీసు విషయంలో జాప్యం చేస్తున్నారంటూ 3,389 కంప్లయింట్స్ వచ్చాయి. ఓలా స్కూటర్ల డెలివరీలో ఆలస్యం జరుగుతోందంటూ 1,899 ఫిర్యాదులు వచ్చాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటరుకు సంబంధించిన సర్వీసు ప్రయోజనాలను తమకు అందించలేదంటూ 1,459 ఫిర్యాదులు అందాయి.