Car Tips:కొత్త కారు ఎప్పటికీ కొత్తదానిలా మెరవాలంటే మెయింటెనెన్స్ ఇలా..

కొత్త కారును ఎప్పటికీ కొత్తగా తళతళ మెరిసేలా ఉంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు!! అయితే ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చక్కగా కారును మెయింటైన్ చేయాలి.

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 12:31 PM IST

కొత్త కారును ఎప్పటికీ కొత్తగా తళతళ మెరిసేలా ఉంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు!!

అయితే ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చక్కగా కారును మెయింటైన్ చేయాలి.

కనీసం క్రమం తప్పకుండా కార్ సర్వీసింగ్ చేయించడంతో పాటు కార్ వాష్ చేయించాలి. కార్ వాష్ విషయంలో అజాగ్రత్తగా ఉంటే కారు పెయింట్ దెబ్బతింటుంది. అంతేకాకుండా, కారుపై కంటికి కనిపించే గీతలు (స్క్రాచెస్) కూడా పడుతాయి.కార్ వాష్‌ కాస్ట్లీ అనుకుంటే.. మీరు ఇంటి దగ్గరే కారును శుభ్రం చేసుకోవచ్చు.ఇంటి వద్ద కార్ వాష్ చేయడం కోసం మీకు ఈ వస్తువులు అవసం అవుతాయి. అవేంటంటే, రెండు బకెట్లు, వాష్ మిట్‌లు (చేతి తొడుగులు), టైర్ బ్రష్, కార్ వాష్ షాంపూ, రెండు లేదా మూడు మైక్రోఫైబర్ టవల్స్, కార్ వాక్స్, అప్లికేటర్ స్పాంజ్, పుష్కలంగా నీటి సరఫరా ఉన్న ట్యాప్ అవసరం. కారును సులభంగా శుభ్రం చేసుకునే పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కారును కడగడం ఇలా..

* కారుని కడగడానికి ముందు దానిని నీడలో పార్క్ చేయాలి.
* కార్ వాష్ చేసే ప్రాంతంలో నీడ లేకపోతే, మీ కారును ఉదయాన్నే కానీ లేదా సాయంత్రం కానీ వాష్ చేయండి.
* మండుటెండలో కారును వాష్ చేయడం వలన కారు ఉపరితలంపై నిలిచే నీరు ఆవిరైపోతుంది. కారు ఉపరితలంపై నీటి మరక (స్ప్లాచ్‌లు) ఏర్పడే అవకాశం ఉంది.
* కారుపై ఎక్కువగా దుమ్ము ఉన్నట్లయితే, డస్టర్ సాయంతో ముందుగా దుమ్ముని తొలగించండి.
* విండ్‌షీల్డ్ వైపర్‌లు క్లిక్ అని శబ్ధం చేసే చేసే వరకు విండ్‌షీల్డ్ నుండి దూరంగా లాగండి.
* మీ కారును వాష్ చేయడానికి ముందు అన్ని విండోలు, డోర్లు, సన్‌రూఫ్‌లను మూసివేయండి.

* రెండు బకెట్లను శుభ్రమైన నీటితో నింపండి.

* మొదటి దశలో ఉపరితలంపై పేరుకుపోయిన ధూళిని వదిలించడానికి ఓ చిన్నపాటి ట్యూబ్ ని కానీ లేదా పైప్ ని ఉపయోగించి, దాని సాయంతో గాలిని ఊదండి.
* ఒకవేళ మీ ఇంటిలో కార్ వాక్యూమ్ లేదా ప్రెజర్ వాష్ ఉంటే వీలైనంత వరకూ వాటిని ఇప్పుడే ఉపయోగించడానికి ప్రయత్నించకండి.
* ధూళిని ఎల్లప్పుడూ పై నుండి క్రిందకు విధిలించడానికి ప్రయత్నించండి. వీల్ ఆర్చ్‌ల క్రింద పేరుకున్న మట్టిని తొలగించడానికి మీరు ప్రెజర్ వాషర్‌ను ఉపయోగించవచ్చు.
* ముందుగా కారు చక్రాల నుండి కడగడం ప్రారంభించండి. ఎందుకంటే ఇవి చాలా మురికిగా ఉండే అవకాశం ఉంటుంది.
* వీల్ క్లీనింగ్ బ్రష్‌పై కొంత కార్ షాంపూని అప్లయ్ చేసి చక్రంలోని ప్రతి మూలను బ్రష్ చేయండి.
* ఒకవేళ మీ వద్ద వీల్ బ్రష్ లేకుంటే మీరు వాష్ మిట్‌ను కూడా ఉపయోగించవచ్చు.
* వీల్స్ లో మురికి మందంగా ఉంటే, దానిని తొలగించడానికి టైర్ బ్రష్ చాలా అనుకూలంగా ఉంటుంది.
* కారు చక్రాలను కడిగిన తర్వాత, నీటితో నిండిన బకెట్లలో ఒకదానిలో సిఫార్సు చేయబడిన కార్ షాంపూని పోసి బాగా నురగ వచ్చే వరకూ కలియబెట్టండి.

*కారుని ఎల్లప్పుడూ పై నుండి క్రింది కడగడం ప్రారంభించండి. ఇది మీ పనిని మరింత సమర్థవంతంగా చేస్తుంది. అంతేకాదు, వాష్ మిట్‌లో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి వాష్ మిట్‌ను తరచూ నీటితో బకెట్‌లో ముంచుతూ శుభ్రం చేసుకోండి.

* కార్ వాష్ సమయంలో కారును పూర్తిగా మంచి నీటితో శుభ్రం చేసే వరకూ తడిగా ఉంచడం చాలా ముఖ్యం.
* కారుపై ఫోమ్ ని అప్లయ్ చేసిన తర్వాత, నీటిని ఉపయోగించి కారుపై ఉండే ఫోమ్ మొత్తం తొలగిపోయే వరకూ క్లీన్ చేయండి. * కారును కడిగిన తర్వాత, మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించి కారును పొడిగా అయ్యే వరకూ తుడవండి.
* కారుని తుడవడం కోసం 1000 GSM కంటే ఎక్కువ ఉన్న మైక్రోఫైబర్ క్లాత్ ను ఉపయోగించడం మంచిది.
*కారుపై తడి లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత, ఇప్పుడు కారు మొత్తానికి వ్యాక్స్‌ను సున్నితంగా అప్లై చేయడానికి అప్లికేటర్ స్పాంజ్‌ని ఉపయోగించండి.
* కారు ఉపరితలంపై కార్ వ్యాక్స్‌ను అప్లై చేసేటప్పుడు గుండ్రంగా రుద్దాలి. కార్ వ్యాక్స్ ని కేవలం బాడీ ప్యానెస్ల్ పై మాత్రమే అప్లయ్ చేయాలి. గాజు ఉపరితలాలపై వ్యాక్స్ ని అప్లయ్ చేయకూడదని గుర్తుంచుకోండి.
* కార్ వ్యాక్స్ ని అప్లై చేసిన తర్వాత, కొన్ని నిమిషాల పాటు వేచి ఉండండి. ఆ తర్వాత శుభ్రమైన మరిు పొడిగా ఉండే మైక్రోఫైబర్ టవల్ ను ఉపయోగించి మరోసారి కారు మొత్తాన్ని శుభ్రంగా తుడవండి. ఇలా చేయడం కారు జీవితకాలం మన్నడంతో పాటుగా ఎప్పటికీ మీ కారు కొత్తదిలా కనిపిస్తుంది.

* ప్రతి కార్ వాష్ తర్వాత వ్యాక్స్ ని అప్లయ్ చేయడం వలన కారుకు కొత్త మెరుపును జోడించడమే కాకుండా, కారుపై ధూళి పేరుకుపోకుండా ఉంటుంది.