First Honda electric motorcycle: త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న హోండా మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్.?

ప్రముఖ బైక్ తయారీ సంస్థ హోండా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కేవలం ఇందనంతో నడిచే

Published By: HashtagU Telugu Desk
Mixcollage 06 Dec 2023 01 50 Pm 8555

Mixcollage 06 Dec 2023 01 50 Pm 8555

ప్రముఖ బైక్ తయారీ సంస్థ హోండా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కేవలం ఇందనంతో నడిచే వాహనాలను మాత్రమే విడుదల చేసిన హోండా సంస్థ మొట్టమొదటిసారి మార్కెట్ లోకి విడుదల చేయబోతోంది. 2024లో తొలి ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించింది. 110-125 సిసి సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ను విడుదల చేయనున్నట్టు హోండా గ్లోబల్ ధృవీకరించింది. ఎలక్ట్రిక్ బైక్స్ దిశగా ముందుకు వెళ్లే ప్రణాళికలో భాగంగా ఈ – బైక్ ను మార్కెట్లోకి తీసుకు రాబోతున్నట్లు వెల్లడించింది.

ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో 2030 నాటికి 3.4 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 4 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుందట హోండా సంస్థ. కాగా హోండా లాంచ్ చేస్తున్న ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ స్వాప్ చేయగల బ్యాటరీలతో వస్తుందట. భారత్ లో ఉత్పత్తి చేస్తున్న ఈ బైక్ ను మొదట భారతదేశంలో ఆ తరువాత ఇతర ASEAN మార్కెట్లు, జపాన్, యూరప్ లలో లాంచ్ చేయాలని భావిస్తున్నారు. 110-125 సిసి సెగ్మెంట్ లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌ లను లాంచ్ చేయనున్నట్లు హోండా ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది.

వాటిలో ఒక ఇ-స్కూటర్‌ కు ఫిక్స్ డ్ బ్యాటరీని మరొక మోడల్ లో మార్చుకోగల బ్యాటరీని అమర్చనున్నారు. అయితే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్ లపై మరింత దృష్టి పెట్టనున్నట్లు హోండా ప్రకటించింది. వివిధ వర్గాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాటిని రూపొందిస్తామని, భారత్ సహా గ్లోబల్ మార్కెట్ లకు అవసరమైన యూనిట్ లను భారత్ లోనే ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది హోండా. అలాగే 2027 నాటికి భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికే ప్రత్యేకంగా ఒక ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఆ ప్లాంట్ నుంచి 2027 తరువాత సంవత్సరానికి 10 లక్షల యూనిట్ లను ఉత్పత్తి చేయగలదని వెల్లడించింది. ఇందు కోసం ప్రత్యేకంగా రూ. 2800 కోట్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది హోండా సంస్థ.

  Last Updated: 06 Dec 2023, 01:53 PM IST