Site icon HashtagU Telugu

Ola S1: ఓలా ఎస్‌1 ఈవీ స్కూటర్‌పై బంపర్ ఆఫర్స్.. ఏకంగా అన్ని రూ.వేలు తగ్గింపు?

Mixcollage 28 Jan 2024 03 02 Pm 9908

Mixcollage 28 Jan 2024 03 02 Pm 9908

ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థ ఓలా వాహన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త కొత్త వాహనాలను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన ఈ స్కూటర్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. ఇప్పటికే చాలాసార్లు ఓలా స్కూటర్ల బంపర్ ఆఫర్లను ప్రకటించిన ఓలా తాజాగా మరోసారి ఓలా ఎస్1 పై భారీగా తగ్గింపు ధరను ప్రకటించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇటీవల ఓలా ఎస్‌ 1 స్కూటర్లపై తగ్గింపులను అందిస్తోంది. అలాగే జనవరి 31 వరకూ ఈ తగ్గింపులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మరి ఆ ఆఫర్ల విషయానికి వస్తే..

ఓలా కంపెనీ గణతంత్ర దినోత్సవం రోజున ఎస్‌1 స్కూటర్లపై ఆఫర్లను ప్రకటించింది. రూ.25,000 విలువైన ప్రత్యేక ఆఫర్లను విడుదల చేసింది. ప్రత్యేక ఆఫర్లు జనవరి 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఆఫర్లు కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్ అంతటా వర్తిస్తాయి. ఓలా ఎలక్ట్రిక్ రిపబ్లిక్ డే ఆఫర్లలో పొడిగించిన వారంటీ పై 50 శాతం తగ్గింపు, ఎస్‌1 ఎయిర్, ఎస్1 ప్రో మోడల్స్‌పై రూ.2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్ ఈఎంలపై కొనుగోలుదారులు రూ.5,000 వరకు తగ్గింపును పొందవచ్చని పేర్కొంది. కంపెనీ జీరో డౌన్ పేమెంట్, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 7.99 శాతం నుండి వడ్డీ రేట్లు వంటి అనేక ఫైనాన్స్ ఆఫర్లను అందిస్తోంది.

అలాగే ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ స్కూటర్లపై గతేడాది డిసెంబర్లో తొలిసారిగా ప్రకటించిన రూ.20,000 తగ్గింపును అలాగే ఉంచుతుంది. అంటే ఈ స్కూటర్‌ ఇప్పడు రూ.89,999 వద్ద కొనుగోలు అందుబాటులో ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ శ్రేణి వివిధ ధరల పాయింట్లలో ఐదు మోడళ్లను కలిగి ఉంది. అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎస్‌1 ఎక్స్‌, ఎస్‌1 ఎక్స్‌ ఎస్‌1 ఎక్స్‌ +, ఎస్‌ 1 ఎయిర్, ఎస్‌1 ప్రోతో ప్రారంభమయ్యే రెండో తరం ఎస్‌1 ప్లాట్ ఫారమ్ పై ఆధారపడి ఉంటాయి. ఎంట్రీ-లెవల్ ఎస్‌ 1 ఎక్స్‌ విక్రయాలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఈ స్కూటర్‌ను రూ.3999 చెల్లించి ప్రీ బుకింగ్‌ చేసుకోవచ్చు.