Buying a Car: కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కోటీశ్వరుల వరకు ప్రతి ఒక్కరికి అనువైన అందుబాటులో ఉండే కార్లు ఉన్నాయి అన్న విషయం

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 05:45 PM IST

ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కోటీశ్వరుల వరకు ప్రతి ఒక్కరికి అనువైన అందుబాటులో ఉండే కార్లు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు కారు కొనడమంటే అది అత్యంత ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ మారుతున్న కాలానికి అనుకుగుణంగా ప్రస్తుతం సామాన్యులు కూడా కారు కొనే పరిస్థితికి వచ్చారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి పదిమందిలో ఎనిమిది మందికి సొంతంగా కార్లు ఉంటున్నాయి. దూర ప్రయాణాలు చేసినప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లొచ్చు అన్న ఉద్దేశాలతో అలాగే ఇతర కారణాలతో సొంతంగా ఒక కారును కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది మొత్తం అమౌంట్ కట్టి తీసుకుంటే మరి కొంత మంది ఈఎంఐ ఆప్షన్ లో కూడా తీసుకుంటూ ఉంటారు.

ఒకవేళ కూడా కారు కొనుగోలు చేయాలి అనుకుంటే 20/4/10 రూల్‌ను విధిగా తెలుసుకోవాల్సి ఉంది. ఇంతకీ ఆ రూల్ ఏంటి అన్న విషయానికొస్తే… ప్రస్తుతం చాలా బ్యాంకులు వారి వారి సిబిల్ స్కోరును బట్టి కారు లోన్ లను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఎన్నో రకాల వాహనాలు వివిధ రకాల ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. కొత్త కారు కోసం ఎంత ఖర్చు చేయాలి తదితర వివరాలపై అవగాహన ఉంటుంది. కారు కోనే వారు సరైన నిర్ణయాలు తీసుకునేలా ఇందులో ఫార్ములాను రూపొందించారు. దీన్ని బట్టి కారు కోసం ఎంత డౌన్ పేమెంట్ చేయాలి, లోన్ వ్యవధి, నెలవారీ ఖర్చులు తదితర అంశాలన్నీ ఇందులో పొందుపరచి ఉంటాయి.

కారుకు అయ్యే మొత్తంలో కనీసం 20% నగదును ముందుగా చెల్లించాలి. దీని వల్ల రుణ మొత్తం తగ్గడంతో పాటూ నెల వారీ చెల్లింపులు కూడా తగ్గుతాయి. తద్వారా కారు విలువ కంటే ఎక్కువ భారం కాకుండా ఉంటుంది. కారుకు సంబంధించిన రుణ కాల వ్యవధి నాలుగేళ్ల వరకూ ఉండేలా చూసుకోవాలి. తక్కువ రుణాలు వడ్డీపై డబ్బును ఆదా చేయడంతో పాటూ దీర్ఘకాలిక ఆర్థికి ఒత్తిడిని నివారిస్తాయి. అలాగే మీ మొత్తం నెలవారీ ఖర్చులు, రుణ చెల్లింపులు, బీమా నిర్వహణ తదితరాలు మీ నెల వారీ ఆదాయంలో 10% కంటే ఎక్కువ ఉండకూడదు. తద్వారా మీకు కారు కోనే సామర్థ్యం ఉందని, కారు ఈఎమ్‌ఐలతో పాటూ ఇతర ఖర్చులను కూడా భరించే స్థాయి మీకు ఉందని దీని ద్వారా అర్థమవుతుంది. కారు ధర తప్పనిసరిగా మీ వార్షిక ఆదాయంలో 50% కంటే తక్కువగా ఉండాలి. అయితే మీరు మీ ఆర్థిక పరిస్థిని అంచనా వేసుకుని తద్వారా మీరు కారు కోసం ఎంత ఖర్చు చేయగలరో చూసుకోవాలి. ఇందుకోసం మీ ఆదాయం, నెలవారీ ఖర్చులను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ బడ్జెట్‌లో విభిన్న రకాల కార్ల కోసం అన్వేషించాలి.

అలాగే కారు ఇంధనం, మరమ్మతులు తదితర ఖర్చులన్నీ మీ బడ్జెట్‌ను మించిపోకుండా ముందే జాగ్రత్తపడాలి. సాధ్యమైనంత వరకూ కొత్త కార్లను కాకుండా తక్కువ కాలం వాడిన వాహనాలను కొనేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఉన్న కారును మార్చే అంశంలో కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. వీలైనంత వరకూ కారును ఎక్కువ కాలం వాడుకోవాలి. ఒకవేళ విధిగా కొత్త కారు కొనాల్సి వస్తే ఇందుకోసం ముందు నుంచే పొదుపు చేసుకోవాలి. మీకు తక్కువ ఆదాయం ఉండడడంతో పాటూ ఇప్పటికే అప్పులు ఉన్నట్లయితే 20/4/10 నియమాలకు కట్టుబడి ఉండడం సవాలుగా మారవచ్చు.