Site icon HashtagU Telugu

Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఇచ్చిన బులెట్ ప్రూఫ్ కారు ప్ర‌త్యేక‌తలు ఇవే!

Jaishankar

Jaishankar

Jaishankar: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నడుమ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) ఇప్పుడు బులెట్‌ప్రూఫ్ కారులో ప్రయాణిస్తారు.విదేశాంగ మంత్రికి ఇప్పటికే జెడ్ స్థాయి భద్రత ఉంది. కానీ ఇప్పుడు ఆయన కాన్వాయ్‌లో బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని కూడా చేర్చారు. సమాచారం ప్రకారం.. ఆయన భద్రత కోసం 33 మంది కమాండోల బృందం 24 గంటలూ సిద్ధంగా ఉంటుంది. ప్రత్యేక బులెట్‌ప్రూఫ్ కారులో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇవి దాడి చేసేవారిని నిలువరించగలవు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’, భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘర్షణ కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా దిగజారాయి. బులెట్‌ప్రూఫ్ కారు ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

బులెట్‌ప్రూఫ్ కారు ప్రత్యేకతలు

బులెట్‌ప్రూఫ్ కారు అనేది నడిచే రక్షణ కవచం లాంటిది. ఇందులో కూర్చున్న ప్రతి వ్యక్తికి పూర్తి భద్రత లభిస్తుంది. బయటి నుంచి చూస్తే ఇది సాధారణ కారు లాగే కనిపిస్తుంది. ఈ కార్లలో బులెట్‌ప్రూఫ్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. కారు బాడీ ప్యానెల్స్‌లో ఆర్మర్ ప్లేట్ ఉంటుంది. బులెట్‌ప్రూఫ్ కారులో ఆర్మర్డ్ ఇంధన ట్యాంక్, ఇంజిన్ కంపార్ట్‌మెంట్ రక్షణ, జీపీఎస్ (GPS), ఓవర్‌ల్యాప్ సిస్టమ్, టెయిల్ పైప్ రక్షణ వంటివి ఉంటాయి.

Also Read: UPSC Exam Calendar 2026 Released: యూపీఎస్సీ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల‌!

బులెట్‌ప్రూఫ్ కారు తయారీ ఖర్చు ఎంత?

భారతదేశంలో బులెట్‌ప్రూఫ్ కారు తయారీకి 6.5 మిమీ మందంతో కూడిన మెటల్ షీట్ ఉపయోగించబడుతుంది. ఒక బులెట్‌ప్రూఫ్ కారు తయారీకి కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. నివేదికల ప్రకారం.. మెర్సిడెస్ లేదా బీఎండబ్ల్యూ వంటి కార్లకు పూర్తి బులెట్‌ప్రూఫింగ్ కోసం సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి.

AK-47 కూడా విఫలం

బులెట్‌ప్రూఫ్ గ్లాస్‌ను బ్యాలిస్టిక్ గ్లాస్ అని కూడా పిలుస్తారు. ఈ గ్లాస్ కారు గాజుపై దాడి చేసే బుల్లెట్లను అడ్డుకుంటుంది. AK-47 కూడా ఈ కార్ల ముందు విఫలమవుతుందని చెబుతారు. అంతేకాదు ఎవరైనా పైనుంచి దాడి చేయకుండా ఉండేందుకు కారు పైకప్పు రక్షణ కోసం ఆర్మర్ గ్రేడ్ ప్రత్యేకంగా రూపొందించబడుతుంది.

ప్రత్యేక రన్ ఫ్లాట్ టైర్లు

బులెట్‌ప్రూఫ్ కారులో ప్రత్యేక రన్ ఫ్లాట్ టైర్లు ఉపయోగించబడతాయి. ఈ టైర్లు దాడికి గురైనా పనిచేయడం ఆగవు. బ్యాలిస్టిక్ దాడి వల్ల కూడా ఈ టైర్లపై ప్రభావం పడదని చెబుతారు. పంక్చర్ అయినప్పటికీ ఈ టైర్లు గంటకు 90 కిమీ వేగంతో ప‌రుగులు తీస్తాయి. ఈ టైర్లు దాడి జరిగినా పనిచేయడం ఆగవు. బ్యాలిస్టిక్ దాడి వల్ల కూడా ఈ టైర్లపై ప్రభావం పడదని చెబుతారు. పంక్చర్ అయినప్పటికీ ఈ టైర్లు గంటకు 90 కిమీ వేగంతో సుమారు 160 నుంచి 320 కిమీ దూరం ప్రయాణించగలవు.

Exit mobile version