Emote Surge: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ పై రూ.45 వేలు డిస్కౌంట్.. ఒక్క ఛార్జ్ తో 450కి.మీ ప్రయాణం?

నిత్యం మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ బైక్లు స్కూటర్లు విడుదల అవుతూనే ఉన్నాయి. అందులో కొన్ని రకాల ఎలక్ట్రిక్ బైక్ లు స్టైలిష్ లుక్స్ తో

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 07:30 PM IST

నిత్యం మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ బైక్లు స్కూటర్లు విడుదల అవుతూనే ఉన్నాయి. అందులో కొన్ని రకాల ఎలక్ట్రిక్ బైక్ లు స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టడంతో పాటు, డిస్కౌంట్ బంపర్ ఆఫర్లతో ఓహో అనిపిస్తున్నాయి. ఇటువంటి వాటిలో తాజాగా మార్కెట్లోకి విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ బైక్ కూడా ఒకటి. సూపర్ స్టైలిష్ లుక్ తో మతి పోగొడుతున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. మరి ఆ బైక్ కి సంబంధించిన మరిన్ని వివరాల విషయానికి వస్తే..
ఇమోట్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరు సర్జ్. సర్జ్ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ అదిరింది.

చూస్తూనే వావ్ అనాల్సిందే. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు. దీని టార్క్ 28 ఎన్ఎం. 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.9 సెకన్లలోనే అందుకుంటుంది. అలాగే దీని రేంజ్ కూడా చాలా ఎక్కువ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 450 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. సదరు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో మూడు బ్యాటరీ ప్యాక్స్ అమర్చింది. ఒక్క బ్యాటరీ రేంజ్ 150 కిలోమీటర్లు. ఇలా మీరు మూడు బ్యాటరీ ప్యాక్స్ వల్ల 450 కిలోమీటర్లు వెళ్లచ్చు. అలాగే ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో గేర్ బాక్స్ కూడా ఉంటుంది. 4 గేరర్లు ఉన్నాయి. ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ టెలీస్కోపిక్, వెనుక భాగంలో హారిజంటల్ యూనిలింక్ మోనోషాక్ సస్సెన్షన్ ఉంటుంది.

అలాగే ఈ బైక్‌లో డిస్క్ బ్రేక్స్ కూడా ఉన్నాయి. ఇంట్లోనే కాకుండా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో కూడా ఈ బైక్‌కు చార్జిగ్ పెట్టుకోవచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. కెపాసిటీ 40 ఏహెచ్. 1.5 లక్షల కిలోమీటర్ల వరకు లైప్ వస్తుందట. ఇంకా ఇందులో 7 ఇంచుల డిస్‌ప్లే, నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్షన్, 4జీ కనెక్టివిటీ బ్లూటూత్ ఎనెబుల్, యాంటీ థెఫ్ట్, జియో ఫెన్సింగ్, రిమోట్ కంట్రోల్, ఆటోమెటిక్ లాక్ అండ్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి. అలాగే ఈ బైక్ రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువే. కిలోమీటరుకు 10 నుంచి 15 పైసలు ఖర్చు అవుతుంది. అంటే రూ.10 15తో దాదాపు 100 కిలోమీటర్లు వెళ్లొచ్చు. మీరు ఈ బైక్ కొనాలంటే కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫ్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. కాగా ఈ బైక్ రెండు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. సర్జ్ 10కే, సర్జ్ 6కే లాంటి రెండు వెరియంట్ లలో లభిస్తున్నాయి. కాగా సర్జ్ 10కే బైక్ ధర రూ.1.35 లక్షలుగా ఉంది. అదే సర్జ్ 6కే ధర రూ.1.15 లక్షలుగా ఉంది. ఈ బైక్స్‌పై ఫేమ్ 2 సబ్సిడీ కింద రూ. 45 వేల తగ్గింపు వస్తోంది. ఫేమ్ 2 డిస్కౌంట్ తర్వాతనే మీరు పైన ఇచ్చిన రేటుకు ఈ బైక్స్‌కు లభిస్తున్నాయి.