Site icon HashtagU Telugu

Electric Scooter: భారీ డిస్కౌంట్ ధరతో ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. నెలకు రూ.1700 కడితే చాలు!

Mixcollage 07 Feb 2024 01 27 Pm 4243

Mixcollage 07 Feb 2024 01 27 Pm 4243

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు చక్కని శుభవార్త. బడ్జెట్ ధరలోనే భారీ తగ్గింపు ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకునే అవకాశం. ఈ ఆఫర్ భారీగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇ-స్కూటర్ కొనుగోలుపై కళ్లుచెదిరే తగ్గింపు అందుబాటులో ఉంది. ఇంతకీ ఆఫర్ ఏమిటి? అది ఎలా పొందాలి? అన్న వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో ఒకటిగా ఉంటూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఫ్రీడమ్ ఎల్ఐ 2 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై అదిరే డిస్కౌంట్ ఉంది. ఇంకా తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు.

ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధర రూ. 75,899గా ఉంది. అయితే ఇప్పుడు మీరు ఈ స్కూటర్ ను రూ. 65,899 కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా రూ. 10 వేల తగ్గింపు వస్తోందని అనుకోవచ్చు. ఇది భారీ తగ్గింపు అని చెప్పువచ్చు. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ అని గుర్తించుకోవాలి. అందువల్ల డీల్ ఉన్నప్పుడే సొంతం చేసుకోవడం ఉత్తమం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 75 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. అంటే ఇది లోస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు.దీని చార్జింగ్ టైమ్ 5 గంటలు. ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. ఇందులో బ్యాటరీ ఇండికేటర్, స్పీడో మీటర్, ట్యాకో మీటర్, ట్రిప్ మీటర్ వంటివి ఉంటాయి.

ఎల్ఈడీ హెడ్‌లైట్స్ అమర్చారు. టెలీస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. రిమోట్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫీచర్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. 3 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 25,300 పడుతుంది. ఆరు నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 12,650 చెల్లించాలి. ఇక 9 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 8434 కట్టాలి. ఇక 12 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 6325 చెల్లించాలి. ఇంకా రూ.35 వేల డౌన్ పేమెంట్ కడితే అప్పుడు నెలకు రూ. 1705 మేర ఈఎంఐ పడుతుంది. ఇక్కడ 24 నెలల టెన్యూర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు వడ్డీ భారం లేకుండా సులభ ఈఎంఐలో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనొచ్చు. అందువల్ల మీరు బడ్జెట్ ధరలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ ఆఫర్ పరిశీలించొచ్చు. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తోంది. అంటే వడ్డీ భారం లేకుండా ఈవీని ఇంటికి తెచ్చుకోవచ్చు.