ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన లెక్ట్రిక్స్ ఈవీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటి వరకు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. కంపెనీ ఒక పండుగ ఆఫర్‌ను విడుదల చేసింది. అయితే దాని హై స్పీడ్ లెక్ట్రిక్స్ ఈవీని రూ. 50,000 కంటే తక్కువ ధరకు అందించడానికి ఆఫర్ చేసింది. అయితే ఇప్పుడు వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పొందవచ్చు. మీరు ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ లో కేవలం రూ. 43,749 కే ఈ లెక్ట్రిక్స్ ఎలక్ట్రిక్ హై స్పీడ్ ను కొనుగోలు చేయవచ్చట.
అయితే ఇందుకోసం కస్టమర్ బ్యాటరీని సేవగా (BAAS) ను చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో కేవలం రూ.43749కే అందుబాటులో ఉంది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమేనని, ఫ్లిప్‌కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. మీరు మొత్తం పరిశ్రమలో దీని కంటే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ ని పొందలేరు. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ద్వారా కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. కాగా ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుందట.
దీని గరిష్ట వేగం 50 కి.మీ. ఇది కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా 3 నుంచి 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందట. అదే సమయంలో దానిపై జీవితకాల బ్యాటరీ వారంటీ అందుబాటులో ఉందని చెబుతున్నారు. అయితే కేవలం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాకుండా ఈ కంపెనీకి చెందిన అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటి ధర రూ. 49,999 అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేయడానికి అనేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయట. ఆ తర్వాత కస్టమర్లు ఈ స్కూటర్‌ను రూ. 43749కి కూడా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ అద్భుతమైన ఆఫర్ ను మిస్ చేసుకోకుండా తక్కువ ధరకే సొంతం చేసుకోండి.