Simple One: రూ. 2 వేలతో ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు?

ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల సం

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 06:09 PM IST

ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాటి విక్రయాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆ కంపెనీలు కూడా అందుకు అనుగుణంగా అదిరిపోయే ఆప్షన్స్ ఉన్నా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇకపోతే మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేయాలని భావిస్తుంటే మీకు ఒక శుభవార్త. సూపర్ లుక్‌తో కిర్రాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈవీ అందుబాటులో ఉంది.

ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఆ వివరాలు లోకి వెళితే.. సింపుల్ ఎనర్జీ అనే కంపెనీ సింపుల్ వన్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో అందుబాటులో ఉంచింది. ఇందులో దుమ్మురేపే ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 212 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇంకా ఇది కేవలం 2.77 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 105 కిలో మీటర్లు. కంపెనీ ఇందులో 5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చింది. అలాగే 8.5 కేడబ్ల్యూ మోటార్ ఉంటుంది. దీని టార్క్ 72 ఎన్ఎం. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 30 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది.

అలాగే యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్ ఉంది. మీ ఫోనకు చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాక్, వైట్, రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇంకా డ్యూయెల్ కలర్ మిక్సింగ్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. అలాటే వన్ ట్యాప్ యాప్ కూడా ఉంటుంది. యాప్ ద్వారా స్కూటర్ కనెక్ట్ అవుతుంది. మీరు యాప్ ద్వారానే రిమోట్ యాక్సెస్, ఓటీఏ అప్‌డేట్స్, రైడ్ స్టాటిస్టిక్స్, సింపుల్ ట్యాగ్, సేవ్ అండ్ ఫార్వర్డ్ రూట్స్, రిమోట్ అలర్ట్స్ వంటి ఫీచర్ల్ పొందొచ్చు. స్కూటర్ డ్యాష్ బోర్డులో పలు రకాల ఫీచర్లు ఉంటాయి. నావిగేషన్ సహా పలు రకాల సర్వీసులు పొందొచ్చు. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర విషయానికి వస్తే.. రూ.1.45 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. అయితే మీరు దీన్ని కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రిబుకింగ్ చేసుకోవచ్చు. కేవలం రూ. 1947 మొత్తంతో మీరు ప్రిబుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనికి మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, పేరు వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది.