Amazon Republic Day Sale: కేవలం రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అమెజాన్ లో అద్భుతమైన ఆఫర్!

అమెజాన్లో ఇప్పుడు బంపర్ ఆఫర్ లభిస్తోంది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎప్పుడు కేవలం 25 వేలకి సొంతం చేసుకోవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Amazon Republic Day Sale

Amazon Republic Day Sale

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న క్రేజ్ డిమాండ్ పెరిగిపోయిన విషయం తెలిసిందే. వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఎక్కువగా ముగుచూపుతున్నారు. కార్లు స్కూటర్లు ఎలక్ట్రిక్ బైక్లు వంటివి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ధరకే లభించే వాహనాల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇకపోతే మీరు కూడా తక్కువ ధరకే మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా, అయితే ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే. ప్రస్తుతం అమెజాన్ లో కొన్ని స్కూటర్ల పై అద్భుతమైన ఆఫర్ లభిస్తోంది. ఇంతకీ ఆ స్కూటర్లు ఏవి ఆ స్కూటర్లు ఎంత తక్కువ ధరకు లభిస్తున్నాయి అన్న విషయానికి వస్తే..

బజాజ్ కంపెనీ నుంచి విడుదలైన చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 123 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. అయితే ఈ స్కూటర్ అమెజాన్ లో ఆఫర్ లో భాగంగా కేవలం రూ. 95,998 కె లభిస్తోంది. ఇందులోని 2.9 కేడబ్యూహెచ్ బ్యాటరీని నాలుగు గంటల్లో 80 శాతం వరకూ చార్జింగ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కాల్ యాక్సెప్ట్/రిజెక్ట్, రివర్స్ లైట్, ఆటో ఫ్లాషింగ్, స్టాప్ ల్యాంప్ వంటి స్మార్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఈవోక్స్ ఈ2. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బాగుంటుంది. దీనిలో దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ ఏర్పాటు చేశారు. భద్రత కోసం డిస్క్ బ్రేక్, యాంటీ థెప్ట్ లాకింగ్ సిస్టమ్ ఉన్నాయి. నలుపు, ఎరుపు, నీలం రంగుల్లో లభించే ఈ స్కూటర్ ను నడపడం చాలా సులభం. కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతంఅమెజాన్ లో రూ.51,499 కు కొనుగోలు చేయవచ్చు.

అలాగే గ్రీన్ ఇన్విక్టా అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను ముఖ్యంగా పెద్దల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీనిలోని ఫిక్స్ డ్ రీచార్జిబుల్ బ్యాటరీని నాలుగు నుంచి ఆరు గంటల్లో చార్జింగ్ చేయవచ్చు. సింగిల్ చార్జింగ్ తో దాదాపుగా 60 కిలో.మీటర్లు పరుగులు తీస్తుంది. ప్రొజెక్టర్ లెన్స్, హెడ్‌లైట్‌, సిగ్నల్ లైట్లు, సౌకర్యవంతమైన కుషనింగ్ సీటు ఏర్పాటు చేశారు. కాగా ఈ స్కూటర్ అమెజాన్ లో రూ.39,999 కె లభిస్తోంది.

కోసం అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. దీనిలోని రీచార్జిబుల్ బ్యాటరీని ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. ట్యూబ్ లెస్ టైర్లు, సిగ్నల్ లైట్లతో పాటు తెలుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ గ్రీన్ సన్నీ స్కూటర్ ను అమెజాన్ లో కేవలం రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు.

  Last Updated: 17 Jan 2025, 12:57 PM IST