Site icon HashtagU Telugu

E-Scooter Charging Tips: కొన్ని నిమిషాలలోనే ఎలక్ట్రిక్ స్కూటర్లకు పూర్తిగా చార్జ్.. ఎలా అంటే?

E Scooter Charging Tips

E Scooter Charging Tips

ఈ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశానంటుతుండడంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే వ్యక్తి వాహనాలు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ చూసే మొదటి పాయింట్ చార్జింగ్ ఎంతవరకు వస్తుంది. చాలామంది ఈ స్కూటర్లకు చార్జింగ్ పెట్టే విషయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దాంతో స్కూటర్లు చార్జింగ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాయి.

మరి తక్కువ సమయంలోనే స్కూటర్ కి తొందరగా చార్జింగ్ ఎక్కే కొన్ని చిట్కాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు అంటే పూర్తిగా ఛార్జ్ అయ్యే వరకు దాన్ని బయటకు తీయకూడదు. అలా చేయడం మంచిది కాదు. ఇది మీరు చేసే అతిపెద్ద తప్పు అవుతుంది. మీరు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయనప్పటికీ, అది బ్యాటరీ పై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది బ్యాటరీ పనితీరును తగ్గిస్తుంది. ఈ సందర్భంలో, ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకేసారి పూర్తిగా ఛార్జ్ చేయాలి. చాలామంది కొన్ని కొన్ని సార్లు అత్యవసర సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను బహిరంగ ప్రదేశాలలో చార్జ్ చేస్తూ ఉంటారు.

మీరు మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇతర ప్రదేశంలో ఛార్జ్ చేస్తుంటే దాన్ని ఆఫ్ చేయండి. అధిక చలి, వేడెక్కడం ఛార్జింగ్ ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఈ సందర్భంలో, మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్‌లో ఆలస్యం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు నీడలో ఛార్జ్ చేయడానికి ప్రయత్నించడం మంచిది..మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించాలి. ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జ్ చేయడం వల్ల ఛార్జింగ్ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఇది కూడా చాలా తక్కువ సమయంలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇటువంటి చిట్కాలు పాటించడం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ తొందరగా ఛార్జ్ అవుతుంది.