Site icon HashtagU Telugu

Best Electric Bikes: మార్కెట్ లో ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ బైక్స్ ఏవి వాటి ధర ఎంతో మీకు తెలుసా?

Best Electric Bikes

Best Electric Bikes

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. రోజురోజుకీ ఈ వాహనాలకి ఉన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతుండడంతో ఆయా వాహన తయారీ సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్న విషయం తెలిసిందే. వాటిలో టాప్ ఫైవ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒబెన్ రోర్.. ఎక్కువ మైలేజీ కావాలనుకునే వారికి ఈ బైక్ బెస్ట్ ఎంపిక అని చెప్పాలి. సింగిల్ చార్జ్ తో 187 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చట. దీని ధర రూ.1.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 4.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, థెప్ట్ అలారం, యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. కేవలం మూడు సెకన్లలోనే 40 కిలో మీటర్ల వేగం అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 100 కిలో మీటర్ల స్పీడ్ తో ప్రయాణం చేయవచ్చు.

అల్ట్రావైలెట్ ఎఫ్ 11 మాక్ 2.. ఎక్కువ ప్రజాదారణ పొందిన బైక్స్ లో ఈ బైక్ కూడా ఒకటి. ఈ బైక్ ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రాడికల్ స్పోర్ట్స్ బైక్ డిజైన్, 7.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతగా చెప్పాలి. సింగిల్ చార్జిపై సుమారు 211 కిలో మీటర్లు పరుగులు తీస్తుంది. మోటారు నుంచి 36.2 బీహెచ్పీ, 90 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. కేవలం మూడు సెకన్లలోనే 60 కిలో మీటర్ల వేగానికి చేరుకుంటుంది. గంటకు 155 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేయవచ్చు.

రివోల్ట్ ఆర్వీ 400 బైక్.. కాగా ఇందులో 3.24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. సింగిల్ చార్జితో దాదాపుగా 150 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. బ్యాటరీని 80 నిమిషాల్లో దాదాపు 80 శాతం చార్జి చేసుకోవచ్చు. ముందు భాగంలో యూఎస్ డీ ఫోర్కులు, వెనుకవైపు ఎడ్జస్టబుల్ మోనోషాక్, డిస్కు బ్రేకులతో కూడిన 17 అంగుళాల టైర్లు దీని ప్రత్యేకత. బైక్ లో మోటారు నుంచి 4.1 కేడబ్ల్యూ శక్తి విడుదల అవుతుంది. ఆకర్షణీయమైన మూడు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ బైక్ ధర రూ.1.20 లక్షలుగా ఉంది.

ఒకాయ ఫెర్రాటో డిస్రఫ్టర్.. ఈ బైక్ లో 3.97 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. కేవలం ఐదు గంటల్లో పూర్తి స్థాయిలో రీచార్జి చేసుకోవచ్చు. సింగిల్ చార్జిపై 125 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. మోటారు నుంచి 6.37 కేబ్ల్యూ గరిష్ట శక్తి, 45 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. ఫెయిర్డ్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ అయిన దీని ధర రూ.1.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గంటకు 95 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుందట.

ఇక చివరి బైక్ విషయానికి వస్తే.. వస్తే రీవోల్ట్ ఆర్వీ1 ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ స్టాండర్డ్ వేరియంట్ రూ.84,999 కు అందుబాటులో ఉంది. దీనిలో 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 2.8 కేబ్ల్యూ మోటారు ఏర్పాటు చేశారు. కేవలం 2.15 గంటలో దాదాపు 80 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. పూర్తిస్థాయి చార్జింగ్ తో వంద కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీనిలోనే ఆర్వీ 1 ప్లస్ వేరియంట్ లో 3.24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీన్ని 3.30 గంటల్లో 80 శాతం చార్జింగ్ చేయవచ్చు. సింగిల్ చార్జితో 160 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీని ధర రూ.99,999. ఈ రెండు మోడళ్లు గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందట.