Affordable EV Scooters: తక్కువ ధరలో అధిక మైలేజ్‌ను ఇచ్చే ది బెస్ట్ ఈవీ స్కూటర్స్.. ఒక లుక్కేయండి?

ఇటీవల కాలంలో భారతదేశంలో ఈవీ స్కూటర్ ల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా టూ వీలర్స్ విభాగంలో ఈవీ స్కూటర్లు వినియోగదాలన

Published By: HashtagU Telugu Desk
Mixcollage 11 Jun 2024 06 47 Am 8694

Mixcollage 11 Jun 2024 06 47 Am 8694

ఇటీవల కాలంలో భారతదేశంలో ఈవీ స్కూటర్ ల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా టూ వీలర్స్ విభాగంలో ఈవీ స్కూటర్లు వినియోగదాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రాను రాను ఈ ఈవీ స్కూటర్ల వాడకం అలాగే వినియోగదారుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ఈవీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మరి వాటిలో తక్కువ ధరలోనే అధిక మైలేజ్‌ను ఇచ్చే టాప్-5 ఈవీ స్కూటర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఓలా ఎస్1 ఎక్స్ ను ఇండియా లోని రసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది 190 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది.

ఇక ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే.. ఈ స్కూటర్ రూ. 99,999 ga ఉంది. ఎస్ 1 ఎక్స్ 4 కేడబ్లూహెచ్ బ్యాటరీ, హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. 90 కేఎంపీహెచ్ గరిష్ట వేగంతో ఈ-స్కూటర్ 0-60 కేఎంపీహెచ్ నుంచి 5.5 సెకన్లలో దూసుకుపోతుంది. అలాగే మరో ఈవీ స్కూటర్ విషయానికి వస్తే.. బజాజ్ ఆటో భారతదేశంలో అత్యంత సరసమైన చేతక్ 2901 ఈ-స్కూటర్‌ను రూ. 95,999 తో విడుదల చేసింది. ఈ కొత్త చేతక్ స్పెషల్ ఎడిషన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కి.మీల ఏఆర్ఏఐ ధ్రువీకరించిన పరిధిని అందిస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్ వంటి మంచి మంచి ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

అదేవిధంగా రెట్రో స్టైలింగ్‌ను అనుసరించి ప్యూర్ ఈవీ ప్లూటో 7జీ ఒక సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలుస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 92,999 గా ఉంది. ఈ స్కూటర్‌లో 2.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, హబ్ మౌంటెడ్ బీఎల్‌డీసీ మోటార్ అమర్చారు. ఈ స్కూటర్ 111 కి.మీ, 151 కి.మీ మధ్య మైలేజ్‌ను అందిస్తుంది. అలాగే 72 కి.మీ గరిష్ట వేగంతో వెళ్తుంది. అదేవిధంగా రూ. 94,900 ధరకే లభించే ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ ఒక ఛార్జ్‌కి 100 కిమీ కంటే ఎక్కువ సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 సెకన్ల మధ్య 0-40 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 53 కి.మీగా చెప్పవచ్చు. అలాగే . 97,256 ధర వద్ద లబించే కొమాకీ ఎస్ఈ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్‌కి 95-100 కిమీల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. 3 కేడబ్ల్యూ బీఎల్‌డీసీ మోటార్‌తో వచ్చే ఈ హై-స్పీడ్ ఈ -స్కూటర్ మూడు రైడ్ మోడ్‌లు అంటే ఎకో, టర్బో, స్పోర్ట్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి.

  Last Updated: 11 Jun 2024, 06:48 AM IST