GT Texa E-Bike: మార్కెట్ లోకి విడుదలైన మరో సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్?

మార్కెట్లోకి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా మద్ద

  • Written By:
  • Publish Date - June 29, 2024 / 07:13 PM IST

మార్కెట్లోకి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా మద్దతు తెలుపుతుండడంతో వాహన తయారీ సంస్థలు ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలనే మార్కెట్లోకి విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇకపోతే తాజాగా కూడా మరొక ఎలక్ట్రిక్ వాహనం కూడా మార్కెట్లోకి విడుదల అయింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ తాజాగా జీటీ ఫోర్స్ తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ జీటీ టెక్సాను విడుదల చేసింది.

ఈ బైక్ ధర రూ. 1,19,555 గా ఉంది. ఈ కొత్త బైక్ అధునాతన సాంకేతికత, పనితీరు, పర్యావరణ అనుకూల ఫీచర్లతో పట్టణ రైడర్ల అవసరాలను తీర్చడానికి రూపొందించారు. ఈ జీటీ టెక్సా బైక్ మనకు నలుపు, ఎరుపు అనే రెండు రంగులలో లభించనుంది. రిమోట్ లేదా కీని ఉపయోగించి ఈ బైక్‌ను ప్రారంభించవచ్చు. 17.78 సెం.మీ ఎల్ఈడీ డిస్ ప్లే స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ బైక్‌లో డిజిటల్ స్పీడోమీటర్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్, మెరుగైన దృశ్యమానత, భద్రత కోసం టర్న్ సిగ్నల్ ల్యాంప్‌లు కూడా ఉన్నాయి. కాగా ఈ జీటీ టెక్సా గంటకు 80 కిలో మీటర్ల గరిష్ట వేగంతో బీఎల్‌డీసీ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది.

ఈ బైక్ 3.5 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120నుంచి 130 కిమీల పరిధిని అందిస్తుంది. ఆటో కట్ ఫీచర్‌తో కూడిన మైక్రో ఛార్జర్‌తో బైక్‌ను 4 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది 180 కిలోల వరకు బరువును మోస్తుంది. అలాగే 18 డిగ్రీల అధిరోహణ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది సిటీ రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాగా టెక్సాలో ట్యూబ్ లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది. ఇది మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఈ-ఏబీఎస్ కంట్రోలర్తో రెండు చక్రాల పై డిస్క్ బ్రేక్లను కలిగి ఉంది. ఈ బైక్ సస్పెన్షన్ సిస్టమ్, ముందు, వెనుక రెండింటిలోనూ టెలిస్కోపిక్ డ్యూయల్ సస్పెన్షన్‌తో, కఠినమైన రోడ్లలో కూడా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది 770 ఎంఎం ఎత్తు, 145 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఈ బైక్ కేవలం 120 కిలోల బరువుతో, జీటీ టెక్సా హ్యాండిల్ చేయడం సులభంగా ఉంటుంది.