Electric Bikes: తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ అవకాశం మిస్ చేసుకోకండి?

మామూలుగా చాలామంది పండుగ సమయాలలో ఆఫర్లు వచ్చినప్పుడు మాత్రమే వాహనాలు కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అందుకు గల కారణం బడ్జెట్. సరైన బ

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 05:30 PM IST

మామూలుగా చాలామంది పండుగ సమయాలలో ఆఫర్లు వచ్చినప్పుడు మాత్రమే వాహనాలు కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అందుకు గల కారణం బడ్జెట్. సరైన బడ్జెట్ లేక అవకాశాలు వచ్చినప్పుడు తక్కువ దొరకే వాహనాలను కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్స్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే ఈ సువర్ణ అవకాశం మీకోసమే. హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో డబుల్ డెక్కర్ స్టాల్ కి వెళ్లాల్సిందే. ఈ స్టాల్ పేరు ఎడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్స్, ఇందులో దాదాపు 14 నుంచి 18 రకాల ఎలక్ట్రిక్ బైక్ లు ఉన్నాయని అతి తక్కువ ధరలోనే హైదరాబాద్ ప్రజల కోసం తీసుకొచ్చినట్లు వారు తెలిపారు.

ఈ స్టాల్లో స్పోర్ట్స్ బైక్ మోడల్, స్కూటీ మోడల్, వ్యవసాయం కోసం పనికొచ్చే డిజైన్తో ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయట. ఈ బైక్ పేరు ఎడిఎంఎస్ షార్క్, ఈ బైక్ అదిరిపోయే స్పోర్ట్స్ లుక్ తో అందరికీ నచ్చే డిజైన్స్ తో ఉందని చెప్తున్నారు. ఈ బైక్ సింగిల్ ఛార్జ్ లో 120 కిలోమీటర్ల దూరం వెళుతుందని చెబుతున్నారు. ఈ బైక్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి కేవలం నాలుగు గంటలు పడుతుందట. ఈ బైక్ కి 2600 Watts పవర్ఫుల్ మోటార్ ఉండడం విశేషం. ఈ బైక్ గరిష్ట వేగం వచ్చేసి గంటకి 120 కిలోమీటర్లు. ఎలాంటి వైబ్రేషన్స్ లేకుండా హాయిగా వెళ్లొచ్చు. ఈ బైక్ కేవలం రూ.1,80,000 కి సొంతం చేసుకోవచ్చు. మరో బైక్ విషయానికి వస్తే.. ఈ బైక్ పేరు పేరు ఎడిఎంఎస్ డిబి. అదిరిపోయే లుక్ తో లగేజ్ పెట్టుకోవడానికి వీలుగా దీనిని డిజైన్ చేశారట.

కాలేజీకి వెళ్లే విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సింగిల్ ఛార్జ్ లో 100 కిలోమీటర్ల దూరం వెళుతుందట. అది ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుందట. ఈ బైక్ మోటర్ కెపాసిటీ వచ్చేసి 2000 వాట్స్ అని చెప్తున్నారు. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటలకి 100 కిలోమీటర్లు అని చెప్తున్నారు. ఈ బైక్ ని రూ. 1,35,000కి కొనుగోలు చేయవచ్చు.

Mixcollage 01 Feb 2024 03 35 Pm 1625

మరో బైక్ ఎడిఎంఎస్ జి టి ఆర్. ఈ బైక్ కేవలం వికలాంగుల కోసం డిజైన్ చేశారని, వికలాంగుల్లో ఆడవారైనా మగవారైనా సులభంగా ఈ బైక్ ని నడపడానికి డిజైన్ చేశారట. ఈ బైక్ సింగిల్ ఛార్జ్ లో 100 కిలోమీటర్ల దూరం వెళుతుందని, ఫుల్ ఛార్జ్ చేయడానికి నాలుగు గంటలు పడుతుందట. వికలాంగులు బైక్ నీ బ్యాలెన్స్ చేయడానికి వారికోసం నాలుగు టైర్లు పెట్టడం విశేషం అని చెప్తున్నారు. ఈ బైక్ కేవలం1,10,000లోపే ఉంటుందట.

మరో బైక్ పేరు ఎడిఎంఎస్ సాతి. ఈ బైక్ కేవలం చిరు వ్యవసాయదారుల కోసం, ఇడ్లీ దోస అమ్ముకునే వాళ్ళ కోసం లేదా డెలివరీ బాయ్స్ కోసం వీలుగా ఉండేలా డిజైన్ చేశారని చెప్తున్నారు. ఈ బైక్ వెనకాల దాదాపు 150 నుంచి 300 కిలోల బరువుని పెట్టొచ్చని, ఏవైనా సామాన్లు పెట్టుకోవడానికి ముందు బుట్టని ఏర్పాటు చేశారని చెప్తున్నారు, ఈ బైక్ సింగిల్ చార్జ్ లో 100 కిలోమీటర్ల దూరం వెళుతుందట. దీని ధర రూ. 1,06,000 కి ఈ బైక్ లభిస్తుందట.

ఈ బైక్ పేరు ఎడిఎంఎస్ లెజెండ్, ఈ బైక్ పేరులోనే కాకుండా పనితీరులో కూడా లెజెండ్ లాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఈ బైక్ కేవలం సన్నగ ఉండే వారికోసం డిజైన్ చేశారని, సింగిల్ ఛార్జ్ లో దాదాపు 100 కిలోమీటర్ల దూరం వెళుతుందని చెప్తున్నారు. ఈ బైక్ గరిష్ట వేగం వచ్చేసి కేవలం గంటకి 45 కిలోమీటర్లు అని చెప్తున్నారు. ఈ బైక్ ని రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ బైక్ కేవలం 90 వేల రూపాయల లోపే వస్తుందని చెప్తున్నారు.