EICMA: ఇటలీలో EICMA 2022 మోటార్‌సైకిల్ షోలో పాల్గొంటున్న ఇండియన్ బ్రాండ్స్ ఇవే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటో కంపెనీలు ఇతర దేశాలలో కూడా మార్కెట్ ను పెంచుకోవడం కోసం ఇంటర్నేషనల్

  • Written By:
  • Publish Date - November 8, 2022 / 05:24 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటో కంపెనీలు ఇతర దేశాలలో కూడా మార్కెట్ ను పెంచుకోవడం కోసం ఇంటర్నేషనల్ వేదికలపై తమ ప్రాజెక్టును ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద మిలాన్ మోటార్ సైకిల్ షో EICMAకు ఇటలీ వేదిక కానుంది. ఈ ఈవెంట్ ఈరోజు అనగా నవంబర్ 8న మిలన్ లో ప్రారంభం అయ్యింది. గత కొన్ని సంవత్సరాలకు ఈవెంట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ పాల్గొంటూనే ఉంది. అలాగే ఈ సంవత్సరం ఇండియా నుంచి మరొక కొత్త బ్రాండ్ అయినా ఓలా ఎలక్ట్రిక్ కూడా హాజరుకానుంది. మరి ఈ ఏడాది ఈ ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన కంపెనీలు ఏ మోడల్స్‌ను ప్రదర్శించనున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అంతర్జాతీయ మోటార్ సైకిల్ ఈవెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ పాల్గొనడం ఇదే మొదటిసారి. కాగా ఓలా సంస్థ ఇండియాలో అతి తక్కువ ధరకే ఓలా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ పోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇటలీ, మిలన్‌లో జరుగుతున్న షోలో ఎలక్ట్రిక్‌ బైక్‌ మొత్తం లైనప్‌ ను ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు. అలాగే తమిళనాడు లోని క్రిష్ణగిరిలోని ఫ్యూచర్ ఫ్యాక్టరీని ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఉంటుందని ఓలా చెబుతోంది. లాటిన్ అమెరికా, ఆసియాన్, యూరప్‌ సహా అమ్మకాలను విస్తరించడానికి కంపెనీ చర్యలు తీసుకుంటోందట. కాగా ఈ మోటార్ సైకిల్ షో ఈవెంట్‌లో జరిగే ఆవిష్కరణలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 అతిపెద్ద హైలైట్ కానుంది.

అలాగే చెన్నైకి చెందిన మ్యాన్ ఫ్యాక్చరర్‌ దీని కోసం టీజర్ ఇమేజెస్‌ ను రిలీజ్‌ చేస్తోంది. సూపర్ మెటోర్ 650 అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్ 648సీసీ పార్లల్ ట్విన్ ఇంజన్‌, 47 hp, 52 Nm టార్క్‌తో వస్తోంది. ఇది సిక్స్‌-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న మూడవ మోటార్‌సైకిల్. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 లలో కూడా పార్లల్ ట్విన్ ఇంజన్‌ ఉంటుంది. సూపర్ మెటోర్ 650, మెటోర్ 350 తరహాలో ఫార్వర్డ్ సెట్ ఫుట్‌రెస్ట్‌లతో కూడిన క్రూయిజర్‌గా ఉంటుంది. ఈ బైక్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ వంటి అప్‌గ్రేడ్ చేసిన ఎక్విప్‌మెంట్స్‌తో వస్తుందని భావిస్తున్న ఈ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్ ధర రూ.2.88 లక్షలు నుంచి మొదలు. అదేవిధంగా రాబోయే సూపర్ మెటోర్ 650 రూ.3లక్షల నుంచి రూ.3.5 లక్షల నుంచి మొదలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.