Dropped Hero Splendor Price: వినియోగదారులకు శుభవార్త చెప్పిన హీరో.. సగం ధరకే స్ప్లెండర్ ప్లస్ బైక్?

తక్కువ ధరకే మంచి బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. హీరో కంపెనీ విడుదల చేసిన కొన్ని ప్రత్యేకమైన మిడిల్ రేంజ్‌ బడ్జెట్‌ క

Published By: HashtagU Telugu Desk
Mixcollage 28 Jan 2024 08 14 Pm 3494

Mixcollage 28 Jan 2024 08 14 Pm 3494

తక్కువ ధరకే మంచి బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. హీరో కంపెనీ విడుదల చేసిన కొన్ని ప్రత్యేకమైన మిడిల్ రేంజ్‌ బడ్జెట్‌ కలిగిన బైక్స్‌పై బంఫర్ ఆఫర్‌ను అందిస్తోంది. హీరో కంపెనీ స్టోర్స్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్, ప్లస్ ఎక్స్‌టెక్, సూపర్, సూపర్ ఎక్స్‌టెక్ వేరియంట్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా వీటిపై అదనంగా కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్స్‌ను కూడా అందిస్తోంది. హీరో ఈ స్ప్లెండర్ ప్లస్ మోటర్‌ సైకిల్స్‌ను రూ.73,400 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. అయితే మేము అందించే కొన్ని టిప్స్‌తో మరింత తగ్గింపుతో ఈ బైక్‌ని పొందవచ్చు.
ఇకపోతే హీరో స్ప్లెండర్ ధర విషయానికి వస్తే..

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్ప్లెండర్ ప్లస్ అత్యంత చౌక ధరల్లో లభిస్తోంది. మొదటి వేరియంట్ రూ.73,440తో అందుబాటులో ఉంది. స్ప్లెండర్ ప్లస్ Xtec వేరియంట్‌ విషయానికొస్తే..రూ. 79,703కు లభిస్తోంది..సూపర్ స్ప్లెండర్ రూ. 80,756తో మార్కెట్‌లో కంపెనీ విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ సూపర్ స్ప్లెండర్ అన్ని హీరో షోరూమ్‌లో అందుబాటులో ఉంది. హీరో కంపెనీ ఈ స్ప్లెండర్ మోడల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీని కోసం ముందుగా మీ పాత మోటార్‌సైకిల్‌ని షో రూమ్‌కి తీసుకువెళ్లి కండీషన్‌ను చెక్‌ చేయించాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది.

ఆ తర్వాత డీలర్‌షిప్ ఎగ్జిక్యూటివ్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు కొత్త హీరో స్ప్లెండర్ కొనుగోలుపై అందుబాటులో ఉన్న ధర తగ్గించి మీకు కొత్త బైక్‌ను అందిస్తారు. హీరో స్ప్లెండర్ ప్లస్ సంబంధించిన కొన్ని వేరియంట్స్‌ 97.2cc BS6 ఇంజన్‌ని కలిగి ఉంటాయి. ఇది 8 bhpతో పాటు 8.05 Nm టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇక హీరో సూపర్ స్ప్లెండర్ వేరియంట్‌లో మాత్రం కంపెనీ 124.7cc BS6 ఇంజన్‌ను అందిస్తోంది. ఇది ఇంతక ముందు ఉన్న వేరియంట్‌ కంటే..10.72 bhp పవర్ అవుట్‌పుట్‌తో పాటు 10.6 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  Last Updated: 28 Jan 2024, 08:15 PM IST