Driving License: భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) లేకుండా డ్రైవింగ్ చేయడం చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరం. దీనికి జరిమానాతోపాటు జైలు శిక్ష విధించవచ్చు. 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి డ్రైవింగ్ చేసే హక్కు ఉన్నప్పటికీ ఈ హక్కు కొన్ని షరతులతో కూడి ఉంటుంది. ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే అతని డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది. డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే నేరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం వల్ల నష్టం
మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తే మీరు ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా జాగ్రత్తగా నడపాలి. అప్పుడే మీతో పాటు ఇతరులు సురక్షితంగా ఉంటారని ట్రాఫిక్ పోలీసులు పదే పదే చెబుతుంటారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన
మీరు నిరంతరం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ లైసెన్స్ రద్దు చేయబడుతుంది. మీరు రాంగ్ లేన్‌లో డ్రైవ్ చేసినా లేదా తప్పుగా ఓవర్‌టేక్ చేసినా మీపై కఠిన చర్యలు తీసుకోవచ్చు.
ఫాగ్ ల్యాంప్ దుర్వినియోగం
శీతాకాలం, వర్షాల సమయంలో పొగమంచును తగ్గించడానికి ఫాగ్ ల్యాంప్‌లను ఉపయోగిస్తారు. అన్ని సమయాల్లో ఇది వినియోగిస్తే జరిమానా విధించవచ్చు.
Also Read: Drinking Water In Morning: ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
తాగి డ్రైవింగ్
మద్యం సేవించి వాహనం నడిపితే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.
అతివేగం
అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగే అవకాశాలు పెరగడమే కాకుండా అతివేగానికి పాల్పడినట్లు తేలితే మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు.
మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం చాలా హానికరం. ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల మీ దృష్టి మారి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది.
జంపింగ్
మీరు రెడ్ లైట్‌ను జంప్ చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయవచ్చు. రెడ్ లైట్ జంపింగ్ తీవ్రమైన నేరం. మీరు రెడ్ లైట్ జంప్ చేస్తే మీ DL నిలిపివేయబడుతుంది లేదా రద్దు కూడా చేస్తారు.