Site icon HashtagU Telugu

Driving Tips : కొత్త బైక్ ని వేగంగా నడుపుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

Driving A New Bike Fast.. But These Things Must Be Known.

Driving A New Bike Fast.. But These Things Must Be Known.

Tips while Driving New Bikes : మామూలుగా మనం ఎప్పుడైనా కొత్త బైక్ కొనుగోలు చేసినప్పుడు మొదటి కొద్దిరోజులు నెమ్మదిగా నడపాలని చాలామంది సూచిస్తూ ఉంటారు. కానీ చాలామంది యువత మాత్రం ఆ మాటలను పెడచెవిన పెట్టేసి కొత్త బైక్ లను చాలా స్పీడ్ గా నడుపుతూ (Driving New Bike) ఉంటారు. కానీ అలా నడపడం (Driving Tips) అసలు మంచిది కాదు. ఎందుకంటే బైక్ కొన్న తర్వాత మనం ఆ బైక్ ని కొన్ని ఏళ్ల పాటు ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఆ బైక్ కొన్ని ఏళ్లపాటు మనకు బాగా ఉపయోగపడాలి అంటే కొన్ని కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి. కొత్త బైక్ ని వేగంగా ఎందుకు నడపకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మరి కొత్త బైక్ ని వేగంగా నడిపితే (Driving Tips) ఏం జరుగుతుంది?

మాములుగా గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగాన్ని ఎకానమీ స్పీడ్ అంటారు. ఈ స్పీడ్‌లో బైక్‌ వెళ్లేటప్పుడు, అతి తక్కువ పెట్రోల్‌ వాడుకుంటుంది. అందుకే దీన్ని ఎకానమీ స్పీడ్ అంటారు. మీరు బైక్ స్పీడో మీటర్‌ని గమనిస్తే అందులో 40-50 ఎకానమీ స్పీడ్‌కి ప్రత్యేక సింబల్స్ ఉంటాయి. కొత్త బైక్ కొన్న తర్వాత, మిమ్మల్ని ఎకానమీ స్పీడ్‌లో నడపమని షోరూం వారు సూచిస్తారు. ఎందుకంటే కొత్త బైక్‌లో ఇన్‌స్టాల్ చేసిన పిస్టన్‌లు, సిలిండర్‌ల వంటి అన్ని భాగాలు కొత్తవి. అవి వెంటనే ఒకదానికొకటి అనుకూలించవు. అవి సెట్ అవ్వడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. కొత్త బైక్‌ నడిపేటప్పుడు అందులో పరికరాల మధ్య కొంత రాపిడీ, ఒరిపిడి వంటివి జరుగుతాయి.

అలాగే ఇంజిన్‌ కూడా ప్రత్యేక వేగాల ప్రకారం వెళ్లేందుకు అలవాటు పడాల్సి ఉంటుంది. ఇలా కొన్ని నెలలకు అన్నీ ఒక పద్ధతిలోకి మారతాయి. ఇలా ఎందుకు? అంటే కంపెనీ తాను రిలీజ్ చేసే ప్రతీ బైక్‌లో ప్రతిదీ క్షుణ్ణంగా పరీక్షిస్తుంది. అయినప్పటికీ అన్నీ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. ఎక్కడైనా 100 శాతం కచ్చితత్వం సాధించడం కష్టం. బైక్ భాగాలను పరీక్షించడానికి నిజంగా దాన్ని వాడినప్పుడు మాత్రమే పూర్తిస్థాయిలో పరీక్షించడానికి వీలవుతుంది. బైక్‌ని రియల్‌గా నడిపేటప్పుడు అందులో భాగాలు ఒకదానికొకటి టచ్ అవుతూ, అనుకూలంగా మారతాయి. కంపెనీలో ఉన్నప్పుడు ఇంత కచ్చితత్వం రాదు. అందువల్ల ప్రారంభంలో బైక్‌ని నెమ్మదిగానే నడపాలి. ప్రారంభంలో బైక్‌ని అతివేగంతో నడిపితే అందులో భాగాలు అతి వేగం వల్ల దెబ్బతినగలవు.

దాంతో కొత్త బైక్ ని కొనుగోలు చేసిన కొన్ని నెలలోనే మళ్లీ రిపేర్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్త బైక్‌లో లూబ్రికెంట్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. లూబ్రికెంట్, బైక్ లోని ముఖ్యమైన భాగాలకు బాగా వ్యాపిస్తుంది. వాటిని సాఫీగా నడపడానికి సహాయపడుతుంది. ఈ పని ఎకానమీ వేగంతో మెరుగ్గా జరుగుతుంది. ఈ కారణాలన్నింటి వల్ల కొత్త బైక్‌ను 40-50 వేగంతో నడపడం మంచిది.ఇలా ఎన్నాళ్లు బైక్ నడపాలి అనేది మరో ప్రశ్న. కంపెనీలు బైక్ మాన్యువల్‌లో ఈ సమాచారాన్ని అందిస్తాయి. సాధారణంగా ఇది 1000-2000 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ మిమ్మల్ని మొదటి సర్వీస్ కోసం పిలుస్తుంది. అప్పటికే అన్ని భాగాలూ ఒకదానికొకటి రాపిడి జరిగి బైక్ భాగాలు సరి అవుతాయి.

Also Read:  Winter Tips: చలికాలంలో ఆ సమస్య వచ్చిందా.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు?