Adventure Bikes : టాప్ – 5 అడ్వెంచర్‌ బైక్స్.. అదరగొట్టే ఫీచర్స్

ఈ బైక్‌లో 20 లీటర్ల కెపాసిటీతో ఫ్యూయెల్ ట్యాంక్ (Adventure Bikes) ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Top 5 Adventure Bikes

Adventure Bikes : చాలామందికి అడ్వెంచర్‌ బైక్స్ అంటే ఇష్టం. ప్రత్యేకించి యువత ఈ బైక్స్‌ను వాడేందుకు మొగ్గు చూపుతుంటారు.  ప్రత్యేకించి ఈ పండుగల సీజన్‌లో చాలామంది యూత్ అడ్వైంచర్ బైక్స్‌ను కొనుగోలు చేస్తుంటారు.ఈ తరుణంలో టాప్ -5  అడ్వెంచర్‌ బైక్స్ మోడళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Also Read :Google Badges : గూగుల్‌లోనూ వెరిఫికేషన్ బ్యాడ్జీలు.. ఫేక్ అకౌంట్స్‌కు చెక్

కేటీఎం 890 అడ్వెంచర్

  • కేటీఎం 890 అడ్వెంచర్‌ బైక్ ధర దాదాపు రూ.11.50 లక్షలు.
  • దీని బరువు 210 కేజీలు.
  • ఈ బైక్‌లో 20 లీటర్ల కెపాసిటీతో ఫ్యూయెల్ ట్యాంక్ (Adventure Bikes) ఉంటుంది.
  • సీట్ ఎత్తు 880 మిల్లీమీటర్లు ఉంటుంది.
  • ఈ బైక్‌లో 889 సీసీ ప్యారలల్‌ టిన్‌ ఇంజిన్‌ ఉంది.

Also Read :Gold Types : 18కే, 22కే, 24కే బంగారం రకాల్లో తేడా ఏమిటి ? క్యారట్ల వ్యాల్యూ ఎంత ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 410

  • రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 410 బైక్  ధర రూ.2.29 లక్షల దాకా ఉంటుంది.
  • ఇందులో 411 సీసీ సింగిల్-సిలిండర్‌, ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్ ఉంది.
  • ఈ బైక్‌లోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు.
  • సీట్ ఎత్తు 800 మిల్లీమీటర్ల దాకా ఉంటుంది.
  • ఈ బైక్ బరువు 185 కేజీలు.

హోండా సీఆర్ఎఫ్ 300 ర్యాలీ

  • హోండా సీఆర్ఎఫ్ 300 ర్యాలీ బైక్  ధర రూ.5 లక్షల దాకా ఉంటుంది.
  • ఇందులో 286 సీసీ సింగిల్ సిలిండర్‌ ఇంజిన్ ఉంది.
  • ఈ బైకులోని ఫ్యూయెల్ ట్యాంకు కెపాసిటీ 12.8 లీటర్లు.
  • సీటు ఎత్తు 885 మిల్లీమీటర్లు.
  • ఈ బైక్ బరువు 153 కేజీలు ఉంటుంది.
  • ఇందులో చాలా స్ట్రాంగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.

బీఎండబ్ల్యూ ఎఫ్850జీఎస్ అడ్వెంచర్

  • బీఎండబ్ల్యూ ఎఫ్850జీఎస్ అడ్వెంచర్ బైక్ ధర రూ.13.75 లక్షల దాకా ఉంటుంది.
  • ఇందులో 853 సీసీ ప్యారలల్‌-టిన్‌ ఇంజిన్‌ ఉంది.
  • దీనిలోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు.
  • సీటు ఎత్తు 835 మిల్లీమీటర్లు ఉంటుంది.
  • ఈ బైక్ బరువు 229 కేజీలు.

సుజుకీ వీ-స్ట్రామ్ 650 ఎక్స్‌టీ

  • సుజుకీ వీ-స్ట్రామ్ 650 ఎక్స్‌టీ బైక్ ధర రూ.8.93 లక్షలు.
  • ఇందులో 645 సీసీ వీ-టిన్‌ ఇంజిన్‌ ఉంది.
  • ఈ బైకులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు.
  • దీనిలోని సీటు ఎత్తు 830 మిల్లీమీటర్లు.
  • ఈ బైకు బరువు 216 కేజీలు.
  Last Updated: 06 Oct 2024, 02:11 PM IST