Site icon HashtagU Telugu

KTM : ‘కేటీఎం’ ఫుల్‌ఫామ్ తెలుసా ? ఈ కంపెనీ అలా మొదలైంది

Ktm Bike Company

KTM : కేటీఎం.. యువత అత్యంత ఇష్టపడే బైక్ బ్రాండ్. భారీ ధరను చెల్లించి ఈ బైక్‌ను కొనడానికి కుర్రకారు ఉవ్విళ్లూరుతుంటారు.  ఇంతకీ KTM అంటే అర్థం ఏమిటి ? నలుపు​, ఆరెంజ్​, తెలుపు రంగుల్లో లభించే కేటీఎం(KTM)  బైక్​ ఫుల్​ఫామ్​ తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు.

We’re now on WhatsApp. Click to Join

  • KTM ఫుల్ ఫామ్  ‘క్రాఫ్ట్ ఫార్జ్యూజ్ ట్రంక్ ఎన్‌పోల్జ్ మ్యటిఘోఫెన్’ (Kraftfahrzeuge Trunkenpolz Mattighofen).
  • KTM కంపెనీ తొలుత ఇనుముకు సంబంధించిన పనులు చేసేది.
  • 1934లో ఆస్ట్రియాకు చెందిన ఇంజినీర్​ హన్స్​ ట్రంకెన్​పోల్జ్ కేటీఎం కంపెనీని ప్రారంభించారు.
  • ఆస్ట్రియాలోని మట్టిగోఫెన్​ ప్రాంతంలో కేటీఎం కంపెనీని మొదలుపెట్టారు. ఆ తర్వాత అది బైక్​ల తయారీలోకి అడుగుపెట్టింది.
  • KTM అనే పేరులోని kraftfahrzeuge అంటే మోటార్​ సైకిల్​ అని అర్థం. Trunkenpolz అనేది కంపెనీ యజమాని పేరు. మట్టిగోఫెన్ అనేది కంపెనీని స్థాపించిన ప్రాంతం పేరు.  ఇవన్నీ కలిపి వచ్చేలా కేటీఎం అనే పేరును పెట్టారు.
  • KTM కంపెనీ పేరెంట్ ఆర్గనైజేషన్ పేరు ‘‘KTM  Sportsmotorcycle AG’.
  • 1951లో తొలిసారి 100సీసీతో R100 బైక్​ను కేటీఎం తయారు చేసింది.  ఇది జరిగిన నాలుగేళ్ల తర్వాత కేటీఎం కంపెనీని Ernst Kronreif అనే వ్యక్తి  కొన్నాడు.
  •  అప్పటి నుంచి కేటీఎం పేరులోని kraftfahrzeuge స్థానంలో కొత్త యజమాని పేరు Kronreif చేరింది.
  • 1994లో KTM  పేరెంట్ కంపెనీ పేరును KTM Sportsmotorcycle GmbH నుంచి KTM Sportsmotorcycle AGగా మార్చారు.

Also Read :Mahindra Thar 5 Door: రూ. 15 ల‌క్ష‌ల‌తో మ‌హీంద్రా కొత్త కారు.. స్పెష‌ల్ ఏంటంటే..?

కేటీఎం బైక్‌పై రీల్స్ చేస్తూ..

ఇటీవలే యూపీలోని వారణాసిలో కేటీఎం బైక్‌పై రీల్స్ చేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులు బస్సును ఢీకొట్టారు. దీంతో.. వారు వంద మీటర్ల దూరంలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను అఖారి గ్రామానికి చెందిన సాహిల్ రాజ్‌భర్(16), చంద్రశేఖర్రాజ్‌భర్(16), శివమ్ రాజ్‌భర్(16)గా గుర్తించారు. ఈ యువకులు కేటీఎం బైక్ పై బచావ్ బజార్‌కు వెళ్లినట్లు తెలిపారు. బచావ్ మార్కెట్ నుండి అక్రి వైపు తిరిగి వస్తూ.. బైక్‌ను ఊపుతూ రీల్స్ చేస్తున్నారు. ఇంతలో ఎదురుగా వస్తున్న బస్సును యువకుల బైక్‌ ఢీకొట్టింది.