Site icon HashtagU Telugu

Gandhi Ji Cars: జాతిపిత మహాత్మా గాంధీజీ వాడిన కార్లు ఇవే..!

Gandhi Ji Cars

Compressjpeg.online 1280x720 Image 11zon

Gandhi Ji Cars: భారతదేశానికి స్వాతంత్య్రం రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరైన మన జాతిపిత మహాత్మా గాంధీ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. భారతదేశపు చరిత్రలో చెరగని ముద్ర వేసుకొన్ని గాంధీజీ ఉపయోగించిన వస్తువులు, తిరిగిన ప్రదేశాలు కూడా ఎంతో ముఖ్యమైనవి. మహాత్మా గాంధీ పుట్టుకతోనే ధనవంతుడైనప్పటికీ, విలాసాలకు మాత్రం దూరంగానే బ్రతికాడు. ఎక్కువ దూరం కాలిబాటనే ప్రయాణం చేసేవాడు. కొన్ని సందర్భాల్లో కార్లు ఉపయోగించేవారు గాంధీజీ..!

సోమవారం గాంధీజీ జయంతి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాంధీజీ నిరసన తెలిపేందుకు వెళ్లిన వాహనాల (Gandhi Ji Cars) గురించి మనం తెలుసుకుందాం. వీటిలో చాలా వాహనాలు గాంధీజీ సన్నిహితులకు చెందినవి. ఈ జాబితాలో మొదటి కారు పేరు ‘ఫోర్డ్ మోడల్ A’ కన్వర్టిబుల్ కారు. 1940లో రామ్‌గఢ్‌లో జరిగిన సభలో గాంధీజీ ఈ కారులో ప్రయాణించారు. ఈ కారు రాంచీకి చెందిన రాయ్ సాహెబ్ లక్ష్మీ నారాయణ్‌కు చెందినది. అతను 1927లో తన కోసం ప్రత్యేకంగా ఈ కారు ఆర్డర్ చేశాడు.

Also Read: Tamil Nadu: తమిళనాడులో పెరగనున్న మద్యం ధరలు.. బాటిల్ పై ఎంతంటే

We’re now on WhatsApp. Click to Join

ఇక రెండో లగ్జరీ కారు ‘ప్యాకర్డ్ 120’. ఇది 1940లో కొనుగోలు చేయబడింది. గాంధీజీ ఈ కారులో ఎక్కువ భాగం ప్రయాణించేవారు. దీని యజమాని ఘనశ్యామ్‌దాస్ బిర్లా. గాంధీజీకి మంచి మిత్రుడు. మూడవ కారు ఫోర్డ్ మోడల్ టి. 1927లో రాయ్‌బరేలీ సెంట్రల్ జైలు నుండి విడుదలైన సమయంలో గాంధీజీ దీనిని నడిపారు. ఇది తరచుగా ర్యాలీలలో పాతకాలపు కారుగా చూడవచ్చు. నాల్గవ కారు స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్.ఈ కారు గాంధీజీ కర్ణాటక పర్యటనలో ఉపయోగించబడింది. ఇది ఆ సమయంలో చాలా ముఖ్యమైన పర్యటన. 1926-33లో తయారు చేయబడిన ఈ కారు 90లలో ప్రసిద్ధి చెందిన కార్లలో ఒకటి.