Site icon HashtagU Telugu

Datsun redi GO: కేవలం రూ.40 వేలకే కారు మీ సొంతం.. పూర్తి వివరాలు ఇవే?

Datsun Redi Go

Datsun Redi Go

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో కార్లు బైకుల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నెలలో పదుల సంఖ్యలో కార్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం మంది మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే వాటిలో హాచ్ బ్యాక్ కారు కూడా ఒకటి. కాగా ఇప్పటికే మారుతిలో ఇప్పటికే అనేక హ్యాచ్ బ్యాక్ మోడల్స్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కార్లు ధరతో ఉండటంతో పాటు ఎక్కువ మైలేజీని ఇస్తున్నాయి. కాగా ఈ హ్యాచ్‌బ్యాక్ కార్ సెగ్మెంట్‌ లో తక్కువ ధరకు ఎక్కువ మైలేజీని ఇచ్చే అనేక కార్లు ఉన్నాయి. వాటిలో డాట్సన్ రెడి గో కూడా ఒకటి.

ఈ కార్ హుందాయ్ లోని ఐ10, మారుతిలోని కే 10 కార్లకు పోటీ అని చెప్పవచ్చు. మీరు ఈ కారును కొనుగోలు చేయడానికి సులభమైన ఫైనాన్స్ ప్లాన్‌తో పాటు ఈ Datsun Redi Go పూర్తి వివరాలను తెలుసుకుందాం… Datsun redi GO ధర విషయానికి వస్తే.. ఈ కారు ధర..రూ. 3,97,80 నుండి ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ రూ. 4,35,551 వరకు ఉంది. కాగా ఆన్.రోడ్ ధర ప్రకారం, మీరు ఈ కారును క్యాష్ మోడ్‌లో కొనుగోలు చేస్తే, దీని కోసం మీకు రూ.4.35 లక్షల బడ్జెట్ ఉండాలి. మీ దగ్గర అంత బడ్జెట్ లేకుంటే లేదా ఇంత మొత్తం కలిసి ఖర్చు చేయకూడదనుకుంటే, ఇక్కడ పేర్కొన్న ఫైనాన్స్ ప్లాన్ ద్వారా కేవలం రూ. 40,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఈ కారును కొనుగోలు చేయవచ్చు. మీకు రూ. 40,000 బడ్జెట్ ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు.

ఈ కారు కోసం బ్యాంక్ రూ. 3,95,551 రుణ మొత్తాన్ని జారీ చేయవచ్చు. ఈ రుణం మొత్తంపై బ్యాంకు సంవత్సరానికి 9.8 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. కాగా Datsun Redi Go డౌన్ పేమెంట్ విషయానికి వస్తే.. లోన్ జారీ అయిన తర్వాత, మీరు ఈ కారు కోసం రూ. 40,000 డౌన్ పేమెంట్ డిపాజిట్ చేయాలి ఆ తర్వాత వచ్చే ఐదేళ్లపాటు ప్రతి నెలా రూ. 8,365 నెలవారీ EMI డిపాజిట్ చేయాలి. ట్రాన్స్మిషన్ డాట్సన్ రెడి గోలో కంపెనీ 799 సిసి ఇంజన్‌ని అందించింది. ఈ ఇంజన్ 53.64 bhp శక్తిని , 72 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంది. మైలేజీకి సంబంధించి ఈ కారు మైలేజ్ లీటరుకు 20.71 కిలోమీటర్లు, ఈ మైలేజీని ARAI ధృవీకరించింది.