Citroen: సిట్రాన్ నుంచి షైన్ ఆల్ ఎలక్ట్రిక్ కారు.. ఆకట్టుకునే లుక్ తో పాటు దిమ్మతిరిగే ఫీచర్స్?

ప్రముఖ ఫ్రాన్స్ వాహనాల తయారీ కంపెనీ సిట్రాన్ ఇండియాలో EC-3 Shine ఆల్ ఎలక్ట్రిక్ కారును తాజాగా లాంచ్ చేసింది. ఇండియాలో ఆల్ ఎలక్ట్రిక్ మొబిలిట

  • Written By:
  • Publish Date - January 25, 2024 / 03:00 PM IST

ప్రముఖ ఫ్రాన్స్ వాహనాల తయారీ కంపెనీ సిట్రాన్ ఇండియాలో EC-3 Shine ఆల్ ఎలక్ట్రిక్ కారును తాజాగా లాంచ్ చేసింది. ఇండియాలో ఆల్ ఎలక్ట్రిక్ మొబిలిటీని తేవాలని ప్రయత్నిస్తూ ఈ కంపెనీ ఈ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా ఇదివరకు సిట్రాన్ EC-3కి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో కంపెనీ ఈ ఫ్లాగ్ షిప్ బి-హ్యాచ్ బ్యాక్‌ని తీసుకొచ్చింది. ఈ కారులో ఎలక్ట్రిక్ డ్రైవింగ్ చాలా బాగుంటుందని కంపెనీ చెబుతోంది. ఈ కారు 4 మోనోటోన్ 7 డ్యూయల్ టోన్‌తో వచ్చింది. ఈ కారు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ.13,19,800 నుంచి ప్రారభమవుతుంది. అయితే పరిచయ ధర మాత్రం రూ.11.61 లక్షలుగా ఉంది.

దీనికి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉండగా బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. అలాగే టాప్ టైర్ వేరియంట్‌లో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVM, వెనుక పార్కింగ్ కెమెరా, 15 అంగుళాల డైమండ్-కట్ ఫ్రంట్ రియర్ స్కిడ్ ప్లేట్లు, రియర్ వైపర్ వాషర్, రియర్ డీఫాగర్, లెదర్ చుట్టిన స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు బ్యాటరీని ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే, 320 కిలోమీటర్లు వెళ్తుంది. దీనికి 100 శాతం డీసీ ఫాస్ట్ ఛార్జ్ సామర్ధ్యం ఉంది. అలాగే 15AMP హోమ్ ఛార్జింగ్ ఆప్షన్‌తో ఈసీ3 షైన్ వచ్చింది. ఏదైనా 15Amp సాకెట్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జ్ 57 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ కారులో 29.2kw కెపాసిటీ బ్యాటరీ ఉంది. దీనికి 7 ఏళ్లు లేదా 140000 కిలోమీటర్ల వారంటీ ఉంది. ఈ బ్యాటరీని బ్రేక్స్‌కి సెట్ చేశారు.

అందువల్ల మీరు బ్రేక్ వేసిన ప్రతిసారీ, కారు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ కారు మాగ్జిమం స్పీడ్ గంటకు 107 కిలోమీటర్లుగా ఉంది. ఈ కారుకు 3 ఏళ్లు లేదా 125000 కిలోమీటర్ల వెహికిల్ వారంటీ ఇస్తున్నారు. ఈ కారు 6.8 సెకండ్లలో జీరో నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీని ఇంజిన్ 143NM టార్క్ ఇస్తోంది. ఈ కారులో ఫుల్లీ ఆటోమేటిక్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. ఆలాగే ఈ-టాగుల్ ఇచ్చారు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ కంట్రోల్ ద్వారా సౌకర్యవంతమైన జర్నీ అనుభవం పొందవచ్చు. సైలెంట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.ఈ కారులో చాలా స్పేస్ ఉంటుంది. వెనకవైపు ప్రయాణికులకు 1378 mm షోల్డర్ రూమ్, ముందున్న ప్రయాణికులకు 991 mm హెడ్ రూమ్ ఉంది. 2540 mm వీల్ బేస్, 315 L బూట్ స్పేస్ ఇచ్చారు. అందువల్ల కంఫర్టబుల్ రైడ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.