ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ రెండు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలనే ఇష్టపడుతుండడంతో మార్కెట్లోకి అధిక శాతం ఎలక్ట్రిక్ వాహనానే విడుదలవుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ బైక్లు ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇవి ఒకదానిని మించి ఒకటి వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. దానికి తోడు ఎలక్ట్రిక్ టు వీలర్ డిమాండ్ తారస్థాయిలో ఉండటంతో దీనిని క్యాష్ చేసుకునేందుకు దిగ్గజ ఆటో మొబైల్ సంస్థలతో పాటు కొత్త కొత్త సంస్థలు సైతం పోటీ పడుతున్నాయి.
ఫలితంగా తక్కువ ధరకే, ఎక్కువ రేంజ్, అధిక ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి బాట్ఆర్ఈ స్టోరీ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఒకటి. దీనిని సిటీ డ్రైవ్ కి ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. మరి ఈ స్కూటర్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. కాగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బాట్ఆర్ఈ స్టోరీ ఎపిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొన్ని నెలల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దీని ధర రూ.94,999 గా ఉంది. కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 12 కలర్ ఆప్షన్లలో లభిస్తుండటం విశేషంగా చెప్పాలి. మిడ్నైట్ బ్లాక్, క్యాండీ రెడ్, ఐస్ బ్లూ, పర్ల్ వైట్, ఎక్రూ ఎల్లో, స్టార్మీ గ్రే, స్టార్‌లైట్ బ్లూ, బ్లేజింగ్ బ్రాంజ్, హంటర్ గ్రీన్, కాస్మిక్ బ్లూ, గన్మెటల్ బ్లాక్, గోల్డ్ రష్ వంటి కలర్స్ లో లభిస్తోంది.
కాగా ఈ స్కూటర్ మన్నికను పెంచడానికి బాడీ ప్యానెల్స్ మెటల్ తో తయారు చేశారట. కాగా ఈ బాట్ఆర్ఈ ఈ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..103 కిలో మీటర్ల రేంజ్‌ని ఇస్తుందట. ఇది రోజువారీ నగర ప్రయాణాలకు సరిపోతుందని, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు అని ఎలక్ట్రిక్ స్కూటర్లోని 60 వీ 40 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఐపీ 67 రేటింగ్ కలిగి ఉంది. కాబట్టి ఇది డస్ట్ వాటర్ ప్రూఫ్. బ్యాటరీ ప్యాక్ డిటాచెబుల్. బ్యాటరీ ప్యాక్ ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుందట. ఇక బ్యాటరీ సామర్థ్యం 2.3 కిలోవాట్లు కాగా, బాట్ఆర్ఈ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలో మీటర్ల వారంటీని అందిస్తోంది. డిజిటల్ స్క్రీన్‌లో డిస్టెన్స్ టు ఎంప్టీ, బ్యాటరీ టెంపరేఛర్, ఛార్జ్ చేయడానికి సమయం వంటి సమాచారాన్ని చూపిస్తుందట.