Site icon HashtagU Telugu

Kia Electric Car: కియా నుంచి బారత్‌లోకి తొలి ఎలక్ట్రిక్ కారు, కేవలం 100 కార్లు మాత్రమే అమ్మే చాన్స్..!!

KIA electric

KIA electric

కియా భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు EV6 ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రీమియం క్రాస్ఓవర్ కారు అని నిపుణులు చెబుతున్నాు. భారతీయ మార్కెట్ కోసం పరిమిత సంఖ్యతో పూర్తి దిగుమతి రేటుతో అమ్మకానికి ఉంచబోతున్నారు. కేవలం 100 కార్లను మాత్రమే కియా ఇంపోర్ట్ చేసి అమ్మబోతోంది. EV6 కారు బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి, కొద్దిమంది కియా డీలర్లు మాత్రమే EV6ని విక్రయించనున్నారు. కొన్ని నగరాలు మాత్రమే ఒకే కియా డీలర్ల ద్వారా EV6ని పొందే వీలుంది. భారతదేశానికి 100 యూనిట్లు మాత్రమే కేటాయించామని, అందువల్ల, EV6 కేవలం వాల్యూమ్ ఉత్పత్తిగా కాకుండా కియా ఏమి చేయగలదో ప్రదర్శించే ప్రీమియం EV అవుతుందని మేనేజ్ మెంట్ పేర్కొంది.

ధరల పరంగా, పూర్తి దిగుమతి అయినందున, EV6 వేరియంట్‌ను బట్టి దాదాపు రూ. 55 లక్షలు ఖర్చు అవుతుంది, అయితే EV6 అన్ని టాప్ ఫీచర్లతో వస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో రాబోయే Kia EV6 సుదీర్ఘ శ్రేణి 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది, ఇది దాదాపు 530km పరిధిని అందించగలదని అంచనా వేస్తున్నారు. అయితే డ్యూయల్ మోటార్ లేదా సింగిల్ మోటారు వెర్షన్ వివిధ పవర్ అవుట్‌పుట్‌లతో రావచ్చు. మరో ఫీచర్ ఏమిటంటే 800V ఛార్జింగ్ సామర్థ్యం అంటే EV6 కేవలం 18 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది ఫాస్ట్ DC ఛార్జర్ ద్వారా చార్జ్ చేయబడుతుంది.

ఇతర ముఖ్యాంశాలలో 6 బ్రేకింగ్ లెవెల్స్, 990mm లెగ్‌రూమ్‌తో ఎక్కువ స్థలం, ఫ్లాట్ ఫ్లోర్‌లు, రెండు 12.3″ హై-డెఫినిషన్ వైడ్‌స్క్రీన్‌లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ HUD, 14-స్పీకర్ మెరిడియన్ సరౌండ్ ఆడియో సిస్టమ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. వరల్డ్ ఆల్ ఇన్ ఆల్, డిమాండ్ చిప్ పరిమితుల వంటి కారణాల వల్ల EV6 ఉత్పత్తి పరిమితంగా చేస్తున్నామని తెలిపారు. అయితే భారతీయ మార్కెట్‌ లో ఉన్న భారీ డిమాండ్ కారణంగా ప్రస్తుతానికి 100 కార్లకే పరిమితం చేస్తున్నామని. ఈ ధర వద్ద, EV6 ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ కారుగా ఉంటుంది, దీనికి ప్రస్తుతానికి పోటీదారులు ఎవరూ లేరని. EV6 అనేది సరికొత్త ఎలక్ట్రిక్- ఇది ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP)పై ఆధారపడి ఉంటుందని కియా మేనేజ్ మెంట్ తెలిపింది.