Site icon HashtagU Telugu

PMV ESS – E Electric Vehicle: అదిరిపోయే లుక్ తో అతి చిన్న ఎలక్ట్రిక్ కారు.. స్పెసిఫికేషన్లు ఇవే?

Pmv Ess E Electric Vehicle

Pmv Ess E Electric Vehicle

భారత మార్కెట్ లోకి ముంబైకి చెందిన స్టార్టప్ పిఎంవి ఎలక్ట్రిక్ మొదటిసారిగా ఎలక్ట్రిక్ వాహనాన్ని నవంబర్ 16న అనగా నేడు లాంచ్ చేసింది. తాజాగా లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ కారుని EaS-E అని పిలుస్తున్నారు. కాగా పి‌ఎం‌వి ఎలక్ట్రిక్ పర్సనల్ మొబిలిటీ వెహికల్ అనే కొత్త సెగ్మెంట్‌ని సృష్టించాలనుకుంటోందట. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన EaS-E అనేది పి‌ఎం‌వి ఎలక్ట్రిక్ మొదటి వాహనం. ఇకపోతే విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ధర విషయానికి వస్తే.. దీని ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.

ఈ కారు అతి చిన్న ఎలక్ట్రికల్ గా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు అద్భుతమైన లుక్ లో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. అతి చిన్న ఎలక్ట్రిక్ కారు సైజు విషయానికి వస్తే..2,915ఎం‌ఎం పొడవు, 1,157ఎం‌ఎం వెడల్పు, 1,600ఎం‌ఎం ఎత్తు ఉంటుంది. బరువు 550 కిలోలు ఉంటుంది. కాబట్టి ఈ కారుని చాలా కాంపాక్ట్ అండ్ నగరాల్లో ప్రయాణించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా చిన్నగా ఉండటం వల్ల పార్కింగ్ చేయడం కూడా సులభం అవుతుంది. ఈ అతి చిన్న ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే డ్రైవింగ్ పరిధి 120 కి.మీ నుంచి 200 కి.మీల మధ్య ఉంటుందని కంపెనీ పేర్కొంది.

డ్రైవింగ్ పరిధి కస్టమర్ ఎంచుకున్న వేరియంట్‌ పై ఆధారపడి ఉంటుంది. వాహనం బ్యాటరీ కేవలం 4 గంటల్లో ఛార్జ్ చేయబడుతుంది. ఇకపోతే కారు ఫీచర్ల విషయానికి వస్తే.. పి‌ఎం‌వి ఎలక్ట్రిక్ EaS-E డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, USB ఛార్జింగ్ పోర్ట్, ఎయిర్ కండిషనింగ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, సీట్ బెల్ట్ ఎన్నో ఫీచర్లు ఈ చిట్టి కారులో ఉన్నాయి.