Site icon HashtagU Telugu

Cars 2024 : జనవరి 1 నుంచి కార్ల ధరలకు రెక్కలు

Best Selling Car

Best Selling Car

Cars 2024 : జనవరి నుంచి కార్ల ధరలు రెక్కలు తొడగనున్నాయి. ముడి పదార్థాల ధరలు, విడి భాగాల ధరలు, తయారీ వ్యయాలు పెరిగినందు వల్ల ధరలు పెంచక తప్పడం లేదని కార్ల కంపెనీలు అంటున్నాయి. కార్ల ధరలు పెంచే విషయాన్ని మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్‌ ప్రకటించాయి.

We’re now on WhatsApp. Click to Join.

కార్ల మోడల్‌ను బట్టి ధరల పెంపులో వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేశాయి. త్వరలోనే కార్ల ధరల పెంపు వివరాలను ప్రకటిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలిపింది. మరికొన్ని వారాల్లో కార్ల ధరల పెంపునకు సంబంధించి వివరాలను ప్రకటిస్తామని టాటా మోటార్స్‌ పేర్కొంది. జనవరి నుంచి తమ వాహనాల ధరలను 2 శాతం పెంచుతామని ఆడి, మెర్సిడెస్‌ బెంజ్‌ కంపెనీలు వెల్లడించాయి.

Also Read: Ceasefire Extended : ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ గడువు పొడిగింపు

మారుతీ సుజుకీ ఎంట్రీ లెవల్ ఆల్టో మొదలు మల్టీ పర్పస్ యుటిలిటీ వెహికల్ ఇన్‌విక్టో వరకూ రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల (ఎక్స్ షోరూమ్) దాకా పలుకుతున్నాయి. ‘కార్ల తయారీ ఖర్చులు తగ్గించడానికి చర్యలు చేపట్టాం. కానీ తయారీ ఖర్చులు పెరుగుతుండటంతో అన్ని మోడల్ కార్ల ధరలు కొంత మేర పెంచక తప్పడం లేదు’ అని మారుతీ సుజుకీ పేర్కొంది.