ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. ఇటీవల వినాయక చవితి సెలబ్రేషన్స్ ముగియగ ఇప్పుడు దసరాకు సంబంధించిన సెలబ్రేషన్స్ మొదలుకానున్నాయి. ఆ తర్వాత వెంటనే మళ్ళీ దీపావళికి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా మొదలుకొని ఉన్నాయి. ఇలా వరుసగా పండుగలు ఉండడంతో కొన్ని కంపెనీలు మొబైల్ పై వాహనాలపై ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఫెస్టివల్ ఆఫర్స్ లో భాగంగా కొన్ని కంపెనీలకు చెందిన కార్లపై భారీగా డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే..
ఫెస్టివల్ సీజన్ ఆఫర్స్ లో భాగంగా టయోటా గ్లాంజా కొనుగోలుపై మీరు రూ. 68,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ జాబితాలో అతిపెద్ద తగ్గింపు గ్లాంజా పై మాత్రమే ఉంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.6.86 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ఉంది. ఇందులో CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
అదేవిధంగా టాటా టియాగో కారు పై కూడా రూ.60 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. టీయాగో ఈవీ పై రూ. 50,000 వరకు తగ్గింపు ఉంది. 2023 మోడల్ పై రూ. 15,000 వరకు ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. టీయాగో, టీయాగో ఈవీ ల ప్రారంభ ధర వరుసగా రూ. 7.99 లక్షలు, రూ. 5 లక్షలు గా ఉంది.
ఈ ఆఫర్స్ లో బాగంగా మీరు ఎంజి కామెట్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తే రూ.60 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో నగదు తగ్గింపు, ఎక్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ లు కూడా ఉన్నాయి. ధర రూ. 4.99 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. కామెట్ ఈవీ దేశంలోని అత్యంత ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా చెప్పవచ్చు.
అలాగే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పై రూ. 53,000 తగ్గింపు లభిస్తుంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ లపై రూ.48,100 వరకు తగ్గింపు ఉంది. దీని ప్రారంభ ధర రూ.5.55 లక్షలుగా ఉంది.
అదేవిధంగా మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ని కొనుగోలు చేయడం ద్వారా రూ. 52,100 వరకు తగ్గింపు లభిస్తోంది. మ్యాన్యువల్ వెర్షన్‌పై రూ.47,100 వరకు, సీఎన్‌జీ వెర్షన్‌పై రూ.37,100 వరకు తగ్గింపు ఉంటుంది. బాలెనో ప్రారంభ ధర రూ.6.66 లక్షలుగా ఉంది.