Site icon HashtagU Telugu

Engine Safety Tips: మీకు కారు లేదా బైక్ ఉందా? అయితే ఈ న్యూస్ మీకోస‌మే!

Engine Safety Tips

Engine Safety Tips

Engine Safety Tips: అక్టోబర్ నెల మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇళ్లలో ఇప్పుడు ఏసీల స్థానంలో ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. అంటే శీతాకాలం అడుగుపెట్టింది. ఈ వాతావరణం మనుషులపైనే కాకుండా మీ కారు, బైక్ ఇంజిన్‌పై (Engine Safety Tips) కూడా ప్రభావం చూపుతుంది. చలికాలంలో కొన్నిసార్లు వాహనం స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో మీరు మీ ఇంజిన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. వాహనాన్ని సులభంగా నడపవచ్చు.

ఇంజిన్ ఆయిల్ తనిఖీ చేయడం మర్చిపోవద్దు

చలికాలంలో ఇంజిన్ ఆయిల్ (Engine Oil) తనిఖీ చేయడం చాలా ముఖ్యం. చలికి చిక్కబడిన ఆయిల్ ఇంజిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. అందుకే చలికాలం ప్రారంభం కాగానే ఇంజిన్ ఆయిల్‌ను తనిఖీ చేయండి. అవసరమైతే తేలికపాటి లేదా చలికి అనుకూలమైన ఆయిల్‌ను మార్చండి. దీనివల్ల ఇంజిన్ త్వరగా స్టార్ట్ అవుతుంది. ఫ్రిక్షన్ (ఘర్షణ) తగ్గుతుంది.

బ్యాటరీ పరిస్థితిపై దృష్టి పెట్టండి

చలిలో బ్యాటరీ సామర్థ్యం కొద్దిగా తగ్గుతుంది. మీ బ్యాటరీ పాతదైనా లేదా బలహీనంగా ఉన్నా వాహనం స్టార్ట్ అవ్వడానికి ఆలస్యం కావచ్చు. బ్యాటరీ టెర్మినల్స్‌ను శుభ్రంగా ఉంచండి. అవసరమైతే ఛార్జింగ్ చేయించండి. సరైన బ్యాటరీతో మీ ఇంజిన్ వెంటనే స్టార్ట్ అవుతుంది.

Also Read: Karur Stampede : కరూర్ తొక్కిసలాటపై CBI విచారణ – సుప్రీంకోర్టు

టైర్ ప్రెజర్‌ను సరిగ్గా ఉంచండి

శీతాకాలంలో టైర్లలో గాలి ఒత్తిడి (ప్రెజర్) తగ్గిపోతుంది. దీనివల్ల టైర్లు బలహీనంగా అనిపించవచ్చు. మైలేజీపై కూడా ప్రభావం పడుతుంది. ప్రతి 15-20 రోజులకు ఒకసారి టైర్ ప్రెజర్‌ను తనిఖీ చేయండి. చలికాలానికి అనుగుణంగా దాన్ని సర్దుబాటు చేయండి. ఇది భద్రత పరంగా కూడా చాలా ముఖ్యం.

ఇంజిన్ కూలెంట్, రేడియేటర్ ఫ్లూయిడ్ తనిఖీ

చలిలో నీరు గడ్డకట్టడం వల్ల ఇంజిన్‌కు నష్టం వాటిల్లవచ్చు. అందుకే కూలెంట్ స్థాయి, మిశ్రమం సరిగ్గా ఉండేలా చూసుకోండి. అవసరమైతే యాంటీ-ఫ్రీజ్ (Anti-Freeze) కలిపి రేడియేటర్‌ను సురక్షితం చేయండి. దీనివల్ల ఇంజిన్ ఎటువంటి సమస్య లేకుండా పనిచేస్తుంది. ఎక్కువ కాలం ప‌నిచేస్తుంది.

స్టార్ట్ చేయడానికి ముందు ఇంజిన్‌ను ప్రైమ్ చేయండి

కారు లేదా బైక్ ఎక్కువసేపు ఆగి ఉన్నట్లయితే వెంటనే స్టార్ట్ చేయకుండా ముందుగా ఇంజిన్‌ను కొద్దిగా రన్ చేసి ఆయిల్‌ను మొత్తం సిస్టమ్‌లోకి చేరేలా చేయండి. ఈ పద్ధతి ఇంజిన్‌కు సురక్షితం, స్టార్టింగ్ సమస్యలను తగ్గిస్తుంది.

Exit mobile version