Site icon HashtagU Telugu

Driverless Car : త్వ‌ర‌లో డ్రైవ‌ర్ లేని కారు

Driverless Car

Driverless Car

డ్రైవ‌ర్ లేకుండా వెళ్లే కారు ఒక డ్రీమ్‌. అది సాకారం కావ‌డానికి ఎంతో దూరం లేదు. కానీ, కొన్ని స‌వాళ్లు మాత్రం వెంటాడుతున్నాయ‌. ప్ర‌త్యేకించి సాంకేతిక‌త‌, న‌మ్మ‌కం భార‌త‌దేశ డ్రైవ‌ర్ లెస్ కారు డ్రీమ్ ను స‌వాల్ చేస్తున్నాయి. వీటిని అధిగ‌మించితే డ్రైవ‌ర్ లెస్ కారు క‌ల నెర‌వేరుతుంద‌ని భార‌త ఆటోమొబైల్ రంగ నిపుణుల భావ‌న‌.భారతీయ రహదారిపై డ్రైవర్ లేని కార్లను డిజైన్ చేయ‌గ‌ల‌మా? ఆ ప‌శ్న కొన్ని సంవత్సరాల నుంచి వ‌స్తుంది. డ్రైవ‌ర్ లేని కారులో వెళ్ల‌డం ప్ర‌స్తుతానికి ఒక‌ ఊహ మాత్రమే. భార‌తీయుల‌కు సుదూర కల కావచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న ప‌రిణామాలు క‌ల‌ను త్వరలో నిజం కాగలదనే న‌మ్మ‌కం క‌లుగుతోంది. భారతదేశం కూడా ఈ కల వైపు నడవడం ప్రారంభించింది. మెయిన్ స్ట్రీమ్ OEMలు, కొత్త యుగం స్టార్టప్‌లు రెండూ సెల్ఫ్ డ్రైవింగ్, డ్రైవర్‌లెస్ వెహికల్ టెక్నాలజీ ప్రయోగాలు చేస్తున్నాయి. ఫ్లక్స్ ఆటో, మైనస్ జీరో, ఏటీ డొమైన్ వంటి స్టార్టప్‌లు భారతీయ రహదారిపై ఈ ఫాంటసీ కార్లు వాస్త‌వ‌రూపంలోకి తీసుకురావ‌డానికి అనేక సవాళ్ల‌ను ఎదుర్కొంటున్నాయి. ఇంతకుముందు డ్రైవర్‌లెస్ కార్లు చాలా సుదూర స్వప్నంగా ఉండేవి. డ్రైవర్‌లెస్ కారును కలిగి ఉండాలనే కలను సాధించడానికి ప్రతి దేశం సవాళ్లను ఎదుర్కొంటుంది, మన దేశానికి కూడా సవాళ్లు ఉన్నాయి. కానీ, వాటిని త్వ‌ర‌లోనే అధిగ‌మించ‌డానికి నిపుణులు అధ్య‌య‌నం చేస్తున్నారు.

Exit mobile version