BYD eMAX 7 : చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘బీవైడీ’ మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దాని పేరు.. ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’. ఇదొక మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ). ఈ కారులో 6 నుంచి 7 దాకా సీట్లు ఉంటాయి. ప్రీమియం, సుపీరియర్ అనే రెండు వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. ప్రీమియం వేరియంట్ ధర రూ.26.90 లక్షల దాకా ఉంది. సుపీరియర్ వేరియంట్ ధర రూ.29.90 లక్షలు. ఇవన్నీ ఎక్స్ షోరూం ధరలే. గతంలో తాము విడుదల చేసిన ‘బీవైడీ ఈ6’ (BYD eMAX 7) కారు మోడల్‌కు కొనసాగింపు ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’ను విడుదల చేశామని కంపెనీ వెల్లడించింది.
Also Read :Osama Bin Laden : ఒసామా బిన్ లాడెన్ కొడుకుకు షాక్.. ఫ్రాన్స్ కీలక ఆదేశం
‘బీవైడీ ఈమ్యాక్స్ 7’ ప్రీమియం వేరియంట్
- ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’ ప్రీమియం వేరియంట్‌లో 55.4 కిలో వాట్ పర్ అవర్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 420 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
- ఇది 163 హెచ్‌పీ శక్తిని రిలీజ్ చేస్తుంది.
- ఇది 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
- దీని టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు.
- ఇది క్వార్ట్జ్ బ్లూ, హార్బర్ గ్రే, క్రిస్టల్ వైట్, కాస్మోస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
- ఈ కారులో 17 అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి. 12.8 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఉంది.
- ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’ ప్రీమియం వేరియంట్‌లో పనోరమిక్ గ్లాస్ రూఫ్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎన్‌ఎఫ్‌సీ కార్డ్ కీ ఇచ్చారు.
‘బీవైడీ ఈమ్యాక్స్ 7’ సుపీరియర్ వేరియంట్
- ‘బీవైడీ ఈమ్యాక్స్ 7’ సుపీరియర్ వేరియంట్‌లో 71.8 కిలో వాట్ పర్ అవర్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 530 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
- ఈమ్యాక్స్ 7 సుపీరియర్ వేరియంట్‌లో లెవల్ 2 స్థాయి ఫీచర్లు ఇచ్చారు.
- బ్యాటరీపై 8 ఏళ్లు వ్యారంటీ ఇస్తారు. 1.6 లక్షల కిలోమీటర్ల దాకా ప్రయాణానికి వ్యారంటీ లభిస్తుంది.
- ఈ కారు మోడల్‌లోని మోటార్‌పై 8 ఏళ్లు వ్యారంటీ ఇస్తారు. 5 లక్షల కిలోమీటర్ల ప్రయాణం దాకా వ్యారంటీని వాడుకోవచ్చు.