Tata Punch: టాటా పంచ్ కారు కొంటున్నారా.. అయితే ఈ ఐదు విషయాలు తెలుసుకోవాల్సిందే?

మీరు కూడా టాటా పంచ్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 2019 లో టాటాపంచ్ ను మొదటిసారి హెచ్ 2 ఎక్స్ కాన్సెప్ట్ గా ప్రదర్శించగా

  • Written By:
  • Updated On - July 14, 2024 / 04:52 PM IST

మీరు కూడా టాటా పంచ్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 2019 లో టాటాపంచ్ ను మొదటిసారి హెచ్ 2 ఎక్స్ కాన్సెప్ట్ గా ప్రదర్శించగా దీనికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ వాహనాన్ని మరికొన్ని సార్లు ప్రదర్శించిన తరువాత, టాటా మోటార్స్ ఎట్టకేలకు 2021లో మరో పంచ్ ను విడుదల చేసింది. ఇది కూడా ఇండియా మార్కెట్ లో తక్షణ విజయాన్ని సాధించింది. ఇప్పటికీ మంచి సేల్స్ సాధిస్తోంది. ఇకపోతే టాటా పంచ్ కారు కొనుగోలు చేయాలనుకున్న వారు గుర్తించుకోవాల్సిన ఆ విషయాలు ఏంటి అన్న విషయానికొస్తే..

టాటా పంచ్ ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు, ఎస్యూవీ ప్రొడక్షన్ వెర్షన్ కాన్సెప్ట్ వెర్షన్ కు చాలా దగ్గరగా ఉంటుందని తెలిపారు. మొదట్లో దీనిపై అందరూ కాస్త అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, తర్వాత టాటా మోటార్స్ వారు మొదట పంచ్ ను చూసినప్పుడు అవి తప్పని నిరూపించారు. ఇది చూడ్డానికి ట్రెండీగా ఉంది. ఆకర్షణీయమైన రోడ్ ప్రెజెన్స్ ను కలిగి ఉంటుందని నిరూపించారు. అదేవిధంగా గ్లోబల్ ఎన్ సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో టాటా పంచ్ కు ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది. వినియోగదారుల రక్షణకు 16.453 పాయింట్లు, గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి బాలల రక్షణకు 40.891 పాయింట్లు లభించాయి.

అదేవిధంగా ట్విన్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీ టాటా మోటార్స్ ట్విన్ సిలిండర్ సీఎన్ జీ టెక్నాలజీతో పంచ్ ను అందిస్తోంది. ఒక పెద్ద సీఎన్జీ ట్యాంకును ఉపయోగించడానికి బదులుగా, పంచ్ లో రెండు చిన్న సీఎన్జీ ట్యాంకులు ఉంటాయి. అయితే మాములుగా సిఎన్జీ వాహనాలలో బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. కానీ, ఇలా రెండు చిన్న ట్యాంక్ లను ఉపయోగించడం వల్ల బూట్ స్పేస్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే తక్కువ శక్తి
టాటా పంచ్ ప్రతికూలతల్లో ఇది కూడా ఒకటి. పంచ్ కొంచెం తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఇందులోని 1.2 లీటర్, 3 సిలిండర్ల, నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ గరిష్టంగా 86 బీహెచ్ పీ పవర్, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ తో వస్తుంది.

అదేవిధంగా సరైన ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లేదు. పంచ్ కేవలం ఏఎంటీ గేర్ బాక్స్ తో మాత్రమే లభిస్తుంది. సీవీటీ, డీసీటీ, టార్క్ కన్వర్టర్ల వంటి సాంప్రదాయ గేర్ బాక్స్ యూనిట్లతో పోలిస్తే ఈ గేర్ బాక్స్ లు కొంచెం జెర్కీగా ఉంటాయి. ఎందుకంటే, AMTలో, ఒకే క్లచ్ ఉండడం వల్ల ఇది సమయం తీసుకుంటుంది. కొన్నిసార్లు, అది గందరగోళానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి, టాటా మోటార్స్ పంచ్ ను ఏఎంటీకి బదులుగా సరైన ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో విక్రయించి ఉంటే బాగుండేదని చెప్పాలి..

Follow us