Site icon HashtagU Telugu

Second Hand Cars : సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

Second Hand

Second Hand

Second hand Cars : మధ్య తరగతికి చెందిన వారు ఫస్ట్ హ్యాండ్ కంటే సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు ఇష్టపడుతుంటారు. ఇది చాలామందికి ఒక ఆకర్షణీయమైన ఎంపిక. తక్కువ ఖర్చుతో మంచి కారు కొనాలని అందరూ భావిస్తుంటారు. కొత్త కారు షోరూమ్ నుండి బయటకు రాగానే దాని విలువ గణనీయంగా పడిపోతుంది. అనగా డిప్రిసియేషన్‌కు గురవుతుంది. ఒక సంవత్సరంలోనే 15-20% విలువ కోల్పోవచ్చు.అందుకే తక్కువ ధరకే మంచి కండిషన్‌లో ఉన్న కారును కొనుగోలు చేయవచ్చు.

Youtube : ‘యూట్యూబ్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయండి’.. గూగుల్ ఇలా ఎందుకు చెప్పిందో తెలుసా!

ఇది బడ్జెట్ పరిమితులు ఉన్నవారికి లేదా కారు నడపడంలో కొత్తగా ఉన్నవారికి గొప్ప అవకాశం. తక్కువ ధరకే కావాల్సిన మోడల్, ఫీచర్స్‌తో కూడిన కారును సొంతం చేసుకోవచ్చు.అయితే,సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ప్రధానంగా, కారు గత చరిత్ర గురించి పూర్తిగా తెలియకపోవడం. యాక్సిడెంట్లు జరిగాయా? ఇంజిన్ సమస్యలు ఉన్నాయా?, అడోమీటర్ (odometer) ట్యాంపరింగ్ చేశారా? వంటి విషయాలు సరిగ్గా తెలియకపోవచ్చు. బయట బాగా కనిపించినా లోపల పెద్ద సమస్యలు ఉండవచ్చు, భవిష్యత్తులో అవి పెద్ద ఖర్చులకు దారితీయవచ్చు.

మెకానిక్ చేత క్షుణ్ణంగా తనిఖీ చేయించుకోకపోతే ఇలాంటి చాలా రిస్కులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. మరో నష్టం ఏంటంటే, సెకండ్ హ్యాండ్ కార్లకు వారంటీ లభించకపోవడం లేదా తక్కువ కాలం మాత్రమే ఉండటం. కొత్త కారుకు తయారీదారు వారంటీ ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ఖర్చు గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ, పాత కారుకు చిన్న సమస్య వచ్చినా సరే, దానికి అయ్యే ఖర్చు మనమే భరించాలి. కొన్నిసార్లు ఊహించని రిపేర్లు వచ్చి మన బడ్జెట్‌ను మించిపోవచ్చు.

అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు తెలివైన నిర్ణయం. కానీ, చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమైన డీలర్ లేదా వ్యక్తి దగ్గర నుండి కొనడం, కారు సర్వీస్ రికార్డులను పరిశీలించడం, అలాగే ఒక నిపుణులైన మెకానిక్‌తో కారును పూర్తిగా తనిఖీ చేయించుకోవడం చాలా ముఖ్యం.సరైన పరిశోధన, తగిన జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ ఖర్చుతో మంచి నాణ్యత గల కారును సొంతం చేసుకొని ఆర్థికంగా లాభపడవచ్చు. ముందుగా తెలిసిన మెకానిక్‌ను తీసుకుని మీరు కొనదలచుకున్న కారును చూపించి చెక్ చేయించాలి. మేజర్ సమస్యలు ఉంటే ముందుగానే నిరాకరించాలి. తక్కువ ధరకు వస్తుందని తీసుకుంటే తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. కారు ఏ మోడల్ అయినా సర్వీసింగ్ రెగ్యులర్‌గా చేయించిన వాహనాలు, యాక్సిడెంట్లకు గురైన వాహనాలను తీసుకోకపోవడమే చాలా మంచిది.

Case File : జగన్ తో పాటు వైసీపీ నేతలపై కేసులు నమోదు..ఎందుకంటే !