Site icon HashtagU Telugu

CNG Cars: సీఎన్‌జీ కారు కొంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Cng Cars

Cng Cars

టీవల కాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటుగా సీఎన్‌జీ వాహనాలకు ఉన్న డిమాండ్ కూడా పెరిగిపోయింది. అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ వాహనాలకు పోటీగా సీఎన్‌జీ వాహనాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. సీఎన్‌జీ అనేది పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో లభించే ఇంధనం కావడంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా కారు కొనుగోలుదారులు సీఎన్‌జీ వాహనాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సీఎన్‌జీ ఆధారిత కార్లు మెరుగైన మైలేజీని అందించడమే కాకుండా ఇంధన ఖర్చులను ఆదా చేయడంలో సహాయపడతాయి.

ఈ హైబ్రిడ్ కార్లు పెట్రోల్, సీఎన్‌జీ రెండు ఇంధనాలతో నడుస్తాయి. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే సీఎన్‌జీ కారు నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సీఎన్‌జీ సిలిండర్ లేదా ఇంధన లైన్ నుండి ఒక చిన్న లీక్ కూడా తీవ్రమైన ప్రమాదాలకు దారి తీస్తుంది. కాబట్టి సీఎన్‌జీ కార్లను నిర్వహించడం చాలా కీలకం. మరి  సీఎన్‌జీ వాహనాలను వినియోగిస్తున్న వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. మీ సీఎన్‌జీ కారును ఎల్లప్పుడూ నీడ ఉన్న ప్రదేశంలో లేదా గ్యారేజీలో పార్కింగ్ చేయడం చాలా మంచిది.

ప్రత్యక్ష సూర్య కాంతికి ఎక్కువసేపు గురి కాకుండా ఉంచితే ప్రమాదాలను నివారించవచ్చు. ఎక్కువసేపు ఎండలో ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మండే వేడి సీఎన్‌జీ ట్యాంక్ జీవిత కాలాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే క్యాబిన్ ఉష్ణోగ్రతను కూడా పెంచుతుందని చెబుతున్నారు. అలాగే మీ కారు ఇంజిన్‌ లోని దహన ప్రక్రియకు స్పార్క్ ప్లగ్‌ లు చాలా ముఖ్యమైనవి. వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతో పాటు అవసరమైనప్పుడు వాటిని భర్తీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ వాహనం కోసం స్పార్క్ ప్లగ్‌ లను ఎంచుకున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ అధిక నాణ్యత, సీఎన్‌జీ అనుకూలమైన, అమర్చిన సీఎన్‌జీ స్పార్క్ ప్లగ్‌ ని ఎంచుకోవాలి.

అలాగే ప్రతి 10,000 కి.మీ లేదా ఆరు నెలలకు ఒకసారి దాన్ని మార్చుకోవాలి. థొరెటల్ బాడీ ఎయిర్ ఫిల్టర్‌ ను ఇన్‌టేక్ మానిఫోల్డ్‌ కి కలుపుతుంది. డర్టీ థొరెటల్ బాడీ ఇంజిన్ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. దహన సమయంలో గాలిని మృదువుగా తీసుకోవాలంటే దాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. అదేవిధంగా భద్రత కోసం అధీకృత సేవా సౌకర్యం ద్వారా సీఎన్‌జీ ట్యాంక్‌ ను క్రమం తప్పకుండా చెక్ చేయడం మంచిది. అలాగే నష్టాలు తుప్పులు పగుళ్లు ఏమైనా ఉన్నాయా అని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. మరి ముఖ్యంగా ట్యాంకు గడువు తేదీని ధ్రువీకరించుకోవాలి. పైన విషయాలను పాటించడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.