Site icon HashtagU Telugu

Ola Scooter: నెలకు రూ.2 వేలతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. మీ సొంతం?

EV Scooter

EV Scooter

భారత ఎలక్ట్రికల్ వెహికల్స్ సంస్థ ఓలా గురించి మనందరికీ తెలిసిందే. ఓలా సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైకులను స్కూటర్లను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఓలా సంస్థ ఇటీవల మార్కెట్లోకి తీసుకువచ్చిన ఓలా ఎస్1 స్కూటర్లను లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లతో అందిస్తోంది. ఇటీవల ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థలతో భాగస్వామ్యం చేసుకున్న ఓలా ఎలక్ట్రిక్, జీరో డౌన్ పేమెంట్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆఫర్ చేస్తోంది. ఐదేళ్లు అంటే 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99 శాతం వడ్డీ రేటుతో ఓలా స్కూటర్‌ను ఇంటికి తీసుకువెళ్లే అవకాశం కల్పిస్తోంది.

ఈ ఆఫర్‌తో ఓలా ఎలక్ట్రిక్ వాహనాలు మరింత సరసమైనవిగా, అందరికీ అందుబాటులో ఉండేలా లభిస్తున్నాయి. కస్టమర్లు ఇప్పుడు అతి తక్కువ ధరకే నెలవారీ ఈఎంఐలతో, జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌కు యజమాని కావొచ్చని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ చెబుతోంది. కాగా ఓలా ఎస్1 ధర రూ.1,09,999. రూ.10,000 డౌన్‌పేమెంట్ చెల్లిస్తే మీకు రూ.99,999 లోన్ 6.99 శాతం వడ్డీకి వస్తుంది. 60 నెలల ఆప్షన్ ఎంచుకుంటే మీరు నెలకు రూ.2,000 లోపే ఈఎంఐ చెల్లించాలి. మీరు డౌన్‌పేమెంట్ చెల్లించకుండా లోన్ తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు. ఎంపిక చేసిన బ్యాంకులతో క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఓలా యాప్ ద్వారా ఓలా స్కూటర్లను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. యాప్‌లోనే ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మరింత సమాచారం కోసం కస్టమర్లు తమ సమీపంలో ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు వెళ్లొచ్చు. ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్స్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ఎంచుకోవచ్చు. ఓలా ప్రస్తుతం 700 పైగా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లతో భారతదేశపు అతిపెద్ద డి2సి ఆటోమొబైల్ రిటైల్ నెట్వర్క్ను కలిగి ఉంది. ఆగస్టులో 1000వ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.

Exit mobile version