Electric Scooter: నెలకు రూ.2000 ఈఎమ్ఐ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోండి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకి ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో వాహన వినియోగదారులు ఎక్కువగా ఎల

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 03:10 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకి ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో వాహన వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా నెలలో లక్షల సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నారు. నేపథ్యంలోనే ఆయా సంస్థలు కూడా మార్కెట్లోకి అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. కాగా ఇటీవల రాయ్‌పూర్ బేస్డ్ ఈవీ బ్రాండ్ గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్, కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కంపెనీ ఎబ్లు ఫియో పేరుతో రూ.99,999 ధరకు సరికొత్త వెహికల్‌ను రిలీజ్ చేసింది.

ఇది ఈవీ టూవీలర్ సెగ్మెంట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎబ్లు ఫియో పోటీ ఇస్తోంది. గోదావరి ఎబ్లు ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం రూ.2,000 ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. 60 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే అతి తక్కువ ఈఎంఐ చెల్లించవచ్చు. వార్షిక వడ్డీ రేటు సుమారు 8.5 శాతంగా ఉంటుంది. గోదావరి ఎబ్లు ఫియో ఈవీ లో 2.52 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది డస్ట్, వాటర్ రెసిస్టెంట్ యూనిట్. స్కూటర్ 110 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఎబ్లు ఫియో ఈ-స్కూటర్‌ను కంపెనీ రాయ్‌పూర్ ఫెసిలిటీలో తయారు చేస్తోంది. అయితే ప్రస్తుతం వెహికల్ ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా ఇందులో దీంట్లో అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కుటుంబ అవసరాలకు సరిపోయే ఫ్యామిలీ ఓరియెంటెడ్ వెహికల్‌గా దీన్ని డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. కుటుంబాలు, నెక్స్ట్ జనరేషన్ బయ్యర్స్‌ అంచనాలు, అవసరాలకు సరిపోయేలా ఎబ్లూ ఫియో స్కూటర్ ఉంటుందని కంపెనీ సీఈఓ హైదర్ ఖాన్ వెల్లడించారు.

ఎబ్లు ఫియో ఈవీ లో ముందు, వెనుక భాగంలో CBS డిస్క్ బ్రేక్‌, హై-రిజల్యూషన్ AHO LED హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. సైడ్ స్టాండ్ సెన్సార్ ఇండికేటర్‌, 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యుయల్ ట్యూబ్ ట్విన్ షాకర్, ఎర్గోనామిక్‌ సీటు, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌ లాంటి స్పెసిఫికేషన్ లతో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది.సర్వీస్ అలర్ట్, ఇన్‌కమింగ్ మెసేజ్ అలర్ట్, కాల్ అలర్ట్, రివర్స్ ఇండికేటర్ వంటి వివరాలు డిస్‌ప్లే చేసే 7.4 అంగుళాల డిజిటల్ ఫుల్ కలర్ డిస్‌ప్లే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. గోదావరి ఎబ్లూ ఫియో, ఎకానమీ, నార్మల్, పవర్ వంటి మూడు రైడింగ్ మోడ్స్‌ ఆఫర్ చేస్తుంది. ఇది 60 kmph టాప్ స్పీడ్‌ను అందిస్తుంది. బ్యాటరీపై ఒత్తిడిని తగ్గించడానికి, డ్రైవింగ్ రేంజ్‌ను విస్తరించడానికి రీజెనరేటివ్ బ్రేకింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కంపెనీ స్కూటర్‌తో పాటు 60 వి హోమ్ ఛార్జర్‌ను అందిస్తుంది. ఇది వెహికల్‌ను 5 గంటల 25 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. కాగా ఈ స్కూటర్ మనకు సియాన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, టెలి గ్రే, ట్రాఫిక్ వైట్ లాంటి ఐదు కలర్ ఆప్షన్ లలో వస్తుంది. ఎబ్లు ఫియో ఈవీ బుకింగ్స్ ఆగస్టు 15న ప్రారంభం కాగా, ఆగస్టు 23 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.