Chetak EV: మార్కెట్లోకి రాబోతున్న మరో బజాజ్ ఈవీ.. ధర, ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ప్రస్తుత రోజుల్లో దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఉన్న డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో మార్కెట్లోకి కొత్త కొత్త ఎలక్

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 07:30 PM IST

ప్రస్తుత రోజుల్లో దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఉన్న డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో మార్కెట్లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఒకదానిని మించి మరొకటి అద్భుతమైన ఫీచర్లతో అత్యాధునిక హంగులతో మార్కుట్లోకి విడుదల అయ్యి వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అందులో భాగంగానే బజాజ్ చేతక్ ఈవీకి కొత్త ఎడిషన్‌ను బజాజ్ ఆటో పరిచయం చేయనుంది. లేటెస్ట్ 2024 చేతన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ జనవరి 9న లాంచ్ చేయనుంది. మరి ఆ బజాజ్ సరికొత్త ఈవీ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికొస్తే.. కొత్త, రివైజ్డ్ చేతక్ ఈవీ సరికొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ మెకానిక్స్ వంటి అప్‌గ్రేడ్స్‌తో రానుంది.

కంపెనీ గత డిసెంబర్‌లోనే 2024 బజాజ్ చేతక్ అర్బేన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు టాప్ ఎండ్ చేతక్ ప్రీమియం వేరియంట్ రిలీజ్‌కు రెడీ అయింది. వచ్చే వారం రిలీజ్ కానున్న 2024 బజాజ్ చేతక్ ఈవీ పెద్ద బ్యాటరీ ప్యాక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఆకట్టుకుటుందని లీకైన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. 2024 బజాజ్ చేతక్ 3.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో రావచ్చు. ఇది సింగిల్ ఛార్జింగ్‌తో 127 కిమీల రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ప్రస్తుతమున్న 2.88 kWh బ్యాటరీ ప్యాక్‌కి ఇది పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పాత బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 113 కిమీల వరకు ప్రయాణించే అవకాశం మాత్రమే ఉండగా, ఈ రేంజ్ కొత్త ఈవీతో మరింత పెరగనుంది. కొత్త ఈవీ బ్యాటరీని సున్నా నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది.

అవుట్‌గోయింగ్ వెర్షన్‌లో టాప్ స్పీడ్ 63 kmph కాగా, త్వరలో రానున్న కొత్త వేరియంట్ గరిష్ట వేగం గంటకు 73 కిలోమీటర్లు ఉంటుంది. 2024 బజాజ్ చేతక్ కొత్త స్క్రీన్‌తో రావచ్చు. పాత LCD యూనిట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్థానంలో కొత్త TFT స్క్రీన్‌ ఉంటుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, రిమోట్ లాక్/అన్‌లాక్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మరిన్ని కొత్త ఫీచర్లను లేటెస్ట్ ఈవీతో అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీని అండర్-సీట్ స్టోరేజీని 18 లీటర్ల నుండి 21 లీటర్లకు పెంచుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వెహికల్‌లో డిజైన్‌ మార్పులతో ఆల్‌ మెటల్ బాడీ ఉంటుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, ఆప్రాన్‌పై లైట్లు వంటి సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్స్ కొత్త మోడల్‌లో కూడా కంటిన్యూ అవుతాయి. సాధారణంగా బజాజ్ ఆటో కంపెనీ చిన్న అప్‌డేట్లతో కొత్త వేరియంట్లను లాంచ్ చేస్తుంది. అయితే 2024 బజాజ్ చేతక్ డిజైన్, పనితీరు, ఫీచర్లను కంపెనీ భారీ స్థాయిలో అప్‌గ్రేడ్ చేస్తోంది. స్టైలిష్ లుక్, అడ్వాన్స్‌డ్ స్పెసిఫికేషన్లతో రానున్న ఈ కొత్త ఈవీ మార్కెట్లోని ఏథర్ 450X, సింపుల్ వన్, TVS ఐక్యూబ్, ఓలా S1 ప్రో వంటి మోడళ్లతో పోటీపడుతుంది.