Cars : ఆ కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 2 లక్షల తగ్గింపుతో కళ్ళు చెదిరే ఆఫర్స్..

ప్రముఖ కార్ల (Cars) కంపెనీలు, టూ వీలర్ల సంస్థలు కూడా భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk

Eye Catching Offers on those Cars : ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఇయర్ ఎండ్ సేల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. 2023 ముగియడానికి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో అనేక రకాల కంపెనీలు ఇయర్ ఎండ్ సేల్స్ ని ప్రారంభించాయి. ఇందులో భాగంగానే స్మార్ట్ ఫోన్స్,ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, కార్స్, బైక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ పై అనేక రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఏకంగా లక్షల్లో ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఇందులో భాగంగానే టాటా కంపెనీ నుంచి వచ్చిన టాటా నెక్సాన్, టియాగో, టైగోర్ మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్లు పలు ప్రయోజనాలతో నిండి ఉంటాయని కంపెనీ తెలిపింది. క్యాష్ డిస్కౌంట్ తో పాటు, కార్పొరేట్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ బోనస్ కింద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ అంతా ఇయర్ ఎండింగ్ సేల్స్ నడుస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపై అదిరే ఆఫర్లను అందిస్తున్నాయి. పలు సంస్థలు క్లియరెన్స్ సేల్స్ కూడా నడుపుతున్నాయి. ప్రముఖ కార్ల (Cars) కంపెనీలు, టూ వీలర్ల సంస్థలు కూడా భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశంలోని ప్రముఖ కార్ మేకర్ అయిన టాటా మోటార్స్ కూడా అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. తన కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఏకంగా రూ. 2లక్షల వరకూ ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. న టాటా నెక్సాన్, టియాగో, టైగోర్ మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్లు పలు ప్రయోజనాలతో నిండి ఉంటాయని కంపెనీ ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్ తో పాటు, కార్పొరేట్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ బోనస్ కింద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఎలక్ట్రిక్ కారు (Cars) కొనుగోలు చేయాలంటే ఈ ఆఫర్లను మిస్ కావొద్దు. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఉన్న స్టాక్ ను బట్టి ఆఫర్లు ఉంటాయాల లేదా అనేది నిర్ణయిస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. మరి ఆ ఆఫర్ల విషయానికి వస్తే.. టాటా నెక్సాన్ ఈవీ.. కాగా మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. టాటా మోటార్స్ ఈ ఏడాది సెప్టెంబర్లో నెక్సాన్ కొత్త ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను కూడా లాంచ్ చేసింది. అయితే పాత వెర్షన్ అంటే ప్రీ ఫేస్ లిఫ్ట్ నెక్సాన్ అమ్ముడు పోని స్టాక్‌లను క్లియర్ చేసేందుకు ప్రైమ్, మాక్స్ వేరియంట్‌లలో అద్భుతమైన ఆఫర్లను కంపెనీ అందస్తోంది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ నెక్సాన్‌పై ఏకంగా రూ. 2.6 లక్షల తగ్గింపును అందిస్తోంది. టాటా కంపెనీకి చెందిన ఈవీల్లో ఇదే ఇప్పుడు చాలా తగ్గింపు ధరకు లభిస్తోంది. నెక్సాన్ ప్రైమ్ వేరియంట్‌ కొనుగోలు చేయాలనుకునే వారు రూ.1.9 లక్షలు తగ్గింపును పొందుతారు. దీనిలో రూ.1.4 లక్షల నగదు, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వస్తుంది. అలాగే నెక్సాన్ మ్యాక్స్ వెర్షన్ పై రూ. 50,000 ఎక్స్ చేంజ్ బోనస్ తో పాటు రూ.2.1 లక్షల నగదు తగ్గింపును పొందవచ్చు. ఈ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు అయిన నెక్సాన్ ప్రైమ్, మ్యాక్స్ ట్రిమ్‌లు రూ. 14.5 లక్షలు- రూ.17.19 లక్షలు, రూ.16.49 లక్షలు- రూ.19.54 లక్షల ఎక్స్ షోరూం ధరలను కలిగి ఉన్నాయి.

టాటా టైగోర్ ఈవీ కార్ విషయానికి వస్తే.. టాటా మోటార్స్ ఇయర్ ఎండ్ డిస్కౌంట్ లో భాగంగా ఈ టాటా టైగోర్ ఈవీపై రూ. 1.1లక్షల తగ్గింపు ను పొందొచ్చు. దీనిలో రూ. 50,000 నగదు తగ్గింపు కాగా ఎక్స్ చేంజ్ బోనస్ రూ. 60 వరకూ పొందవచ్చు. దీని బేస్ ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75లక్షల వరకూ ఉంది.

టాటా టియాగో ఈవీ… టాటా మోటార్స్ ఇయర్ ఎండ్ డిస్కౌంట్లో భాగంగా ఈ టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు పై రూ. 77,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. ఇందులో రూ. 55,000 క్యాష్ తగ్గింపు కాగా.. గ్రీన్ బోనస్ గా రూ. 15,000, రూ. 7000 విలువైన కార్పొరేట్ తగ్గింపులు ఉంటాయి. ఈ మోడల్ ప్రస్తుత మార్కెట్ ధర రూ. 8.69 లక్షలు నుంచి రూ.12.04 లక్షల మధ్య ఉంది.

Also Read:  Tesla EV Factory: గుజరాత్‌లో టెస్లా ఈవీ ఫ్యాక్టరీ.. EV మార్కెట్ రూపురేఖలు మారిపోతాయా..?

  Last Updated: 30 Dec 2023, 01:25 PM IST