Site icon HashtagU Telugu

Mahindra XUV 700: బంపర్ ఆఫర్ ప్రకటించిన మహీంద్రా.. కారుపై ఏకంగా అన్ని లక్షలు తగ్గింపు?

Mixcollage 18 Jul 2024 12 19 Pm 7830

Mixcollage 18 Jul 2024 12 19 Pm 7830

ఇండియాలో మహీంద్రా కార్లకు ఉన్న ప్రత్యేకత గురించి క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. కేవలం ఫీచర్ల విషయంలో మాత్రమే కాకుండా అమ్మకాల విషయంలో కూడా ఎప్పటికప్పుడు ముందంజలో ఉంటూ రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది మహీంద్రా. మార్కెట్లోకి రకరకాల కార్లు విడుదల చేయడంతో పాటు ఇప్పటికే విడుదల చేసిన వాటిపై కూడా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా మహీంద్రా కారుపై ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే.. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును మార్కెట్ లోకి రిలీజ్ చేసి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా మహీంద్రా సంస్థ ఆ కారుపై రూ. 2.2 లక్షల వరకు భారీ తగ్గింపు ధరను ప్రకటించింది.

అయితే ఈ తగ్గింపు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. రేంజ్ టాపింగ్ ఏఎక్స్7 వేరియంట్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. మహీంద్రా ఏఎక్స్7 శ్రేణి రూ. 21.44 లక్షలతో ప్రారంభమైంది. ఇప్పుడు భారీ తగ్గింపుతో ఈ కారు కేవలం రూ. 19.69 లక్షలకు లభిస్తోంది. టాప్ స్పెక్స్‌ తో వచ్చే ఏఎక్స్ 7 లగ్జరీ ఏడబ్ల్యూడీ వేరియంట్ తగ్గింపు ధరతో రూ. 24.99 లక్షలకు లభిస్తోంది. ఇకపోతే ఈ కారుకు సంబందించి మరిన్ని వివరాల్లోకి వెళితే… తాజాగా తగ్గింపులతో బెంగళూరులో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 టాప్ ఆఫ్ ది లైన్ ఏఎక్స్ 7 ఏడబ్ల్యూడీ డీజిల్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. 31.5 లక్షలుగా ఉంటే ఢిల్లీలో మైక్రో ఎస్‌యూవీ ధర 29.62 గా ఉంది.

ముంబైలో రూ.30.2 లక్షలు, చెన్నైలో రూ.31.5 లక్షలు, హైదరాబాద్‌లో ఈ ఎస్‌యూవీ తగ్గింపుల అనంతరం రూ.31 లక్షలకు అందుబాటులో ఉంది. అలాగే కోల్‌కత్తా లో రూ.27.87 లక్షలు, లక్నోలో 28.97 లక్షలు, జైపూర్లో రూ.29.92 లక్షలు, అహ్మదాబాద్‌ లో రూ.28 లక్షలు, ఇండోర్‌ లో రూ.30.87 లక్షలుగా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. టాప్ ఆఫ్ లైన్ ఏఎక్స్7 మోడల్ లెవెల్ 1 ఏడీఏఎస్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం ట్విన్ డిజిటల్ స్క్రీన్లు, పనోరమిక్ సన్రూఫ్, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసేలా డ్రైవర్ సీటు వంటి ఫీచర్ లను ఇందులో అందించారు. వెంటిలేటెడ్ సీట్లు, ఏడు ఎయిర్‌బ్యాగ్లు, లెథెరెట్ సీట్ అష్టోల్బరీ, 12 స్పీకర్లతో 3డీ సౌండ్ సిస్టమ్ వంటివి ఈ కారు ప్రత్యేకతలుగా ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. 2.0-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ 200 హెచ్‌పీ శక్తిని, 380ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.