Komaki LY EV Scooter : ఆ ఈవీ స్కూటర్ పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.19 వేల తగ్గింపు?

ఈ నేపథ్యంలోనే తాజాగా కొమాకీ ఈవీ స్కూటర్‌ (Komaki EV Scooter) కొనుగోలు ప్రత్యేక తగ్గింపు ఆఫర్ లను ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Bumper Offer On Komaki Ly Ev Scooter.. Rs. 19 Thousand Discount At The Same Time..

Bumper Offer On Komaki Ly Ev Scooter.. Rs. 19 Thousand Discount At The Same Time..

Komaki LY EV Scooter : దేశవ్యాప్తంగా ఈవీ వాహనాల జోరు పెరిగిపోతోంది. దాంతో అన్ని రకాల కంపెనీలు తమ మోడల్స్ ఈవీ లను జోరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన ఈవీ స్కూటర్ల పై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కొమాకీ ఈవీ స్కూటర్‌ (Komaki EV Scooter) కొనుగోలు ప్రత్యేక తగ్గింపు ఆఫర్ లను ప్రకటించింది. కొమాకీ తన ఎల్‌వై స్కూటర్‌ (Komaki LY EV Scooter) పై ఏకంగా రూ.18,968 ల భారీ తగ్గింపు ధరను ప్రకటించింది. ఈ స్కూటర్‌ ధర రూ.96,968 కాగా 18 వేల తగ్గింపుతో ఈ స్కూటర్‌ రూ.78000కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం కొద్దీ రోజుల వరకు మాత్రమే ఉంటుదని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే బ్రాండ్‌ డిస్కౌంట్‌ లభ్యతకు సంబంధించిన సరైన సమయ ఫ్రమ్‌ను మాత్రం ప్రకటించలేదు. మరి ఈవీ స్కూటర్ కొమాకీ ఎల్‌వై ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది సిటీ ప్రాంతానికీ అనువుగా ఉండే హై స్పీడ్‌ ఎలక్ట్రిక​ స్కూటర్‌గా వస్తుంది. ఈ స్కూటర్‌ సింగిల్‌, డ్యుయల్‌ బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. సింగిల్‌ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్‌ 85 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. అలాగే డ్యుయల్‌ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ ఒక సారిచార్జ్‌ చేస్తే చాలు 200 కిలో మీటర్ల వరకు మైలేజీని పొందవచ్చు. స్వాపబుల్‌ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్‌ నాలుగు గంట 55 నిమిషాల్లో పూర్తిగా చార్జ్‌ చేయవచ్చు.

అయితే ప్రస్తుతం సింగిల్‌ బ్యాటరీ వెర్షన్‌పై మాత్రమే రూ.19,000 తగ్గింపును అందిస్తోంది. కొమాకీ ఎల్‌వై ఈవీ స్కూటర్‌ ఇనుస్ట్రుమెంట్‌ క్లస్టర్‌ కోసం టీఎఫ్‌టీ స్క్రీన్‌తో వస్తుంది. ముఖ్యంగా నావిగేషన్‌ వివరాలను చూపుతుంది. అలాగే ఆన్‌బోర్డులో సౌండ్‌ సిస్టమ్‌ ఉంది. ముఖ్యంగా బ్లూటూత్‌ కనెక్టవిటీ ద్వారా ప్లే చేసుకోవచ్చు. ఇది హెడ్‌ ల్యాంప్‌, టర్న్‌ ఇండికేటర్‌, టెయిల్‌ లైట్‌లతో సహా ఎల్‌ఈడీ లైట్లతో వస్తుంది. కొమాకీ ఎల్‌వై చెర్రీ రెడ్‌, మెటల్‌ గ్రే, జెట్‌ బ్లాక్‌ కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది..

Also Read:  Chrome – Warning : గూగుల్ క్రోమ్‌ యూజర్స్‌కు ప్రభుత్వం వార్నింగ్

  Last Updated: 15 Dec 2023, 11:01 AM IST