Ather Energy : ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.24వేల డిస్కౌంట్..

తాజాగా బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ (Ather Energy) కంపెనీ ఏథర్ ఎనర్జీ డిసెంబర్ డీల్స్ (December Deal)ను ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 05:40 PM IST

Bumper Discount Offer from Ather Energy : ప్రస్తుతం మార్కెట్లో ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగానే స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రిక్ స్కూటర్లు బైక్లు ఎలక్ట్రిక్ కార్ల పై ఆయా కంపెనీలు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే ఇప్పటికే పలు సంస్థలు బంపర్ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఇంతకీ ఆ కంపెనీ ఏది? ఆ స్కూటర్ పై ఎంత డిస్కౌంట్ ప్రకటించింది అన్న వివరాల్లోకి వెళితే.. తాజాగా ఏథర్ ఎనర్జీ (Ather Energy) కంపెనీ ఏథర్ ఎనర్జీ డిసెంబర్ డీల్స్ (Ather Energy December Deal)ను ప్రకటించింది. బెంగళూరుకు చెందిన ఈ టూవీలర్ ఈవీ బ్రాండ్, డిసెంబర్ 31 వరకు వివిధ ప్రొడక్ట్స్‌ పై డిస్కౌంట్ లను అందిస్తోంది. ఇయర్ ఎండ్ ఆఫర్లలో ఏథర్ ఎనర్జీ 450S, 450X ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.24,000 వరకు డిస్కౌంట్లు అందిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాకుండా వీటితో పాటు రూ.6,500 వరకు క్యాష్ బెనిఫిట్స్ సైతం ఉన్నాయి. ఇందులో రూ. 5,000 వరకు ఎలక్ట్రిక్ డిసెంబర్ డీల్, రూ. 1,500 కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. కాంప్లిమెంటరీ బ్యాటరీ ప్రొటెక్షన్ ప్యాకేజీని కూడా కంపెనీ ప్రకటించింది. 5 సంవత్సరాలు లేదా 60,000km కవరేజీ వరకు రూ. 7,000 విలువైన ఈ ప్యాకేజీని పొందవచ్చు. ఇండస్ట్రీలో మొదటిసారి 70% స్టేట్-ఆఫ్-హెల్త్ హామీతో వెహికల్స్ వస్తాయి. ఏథర్ కంపెనీ తాజా ఆఫర్లలో ఫ్లెక్సిబుల్ EMI స్కీమ్స్ ని కూడా అందిస్తోంది. కేవలం సంవత్సరానికి 5.99 శాతంతో అతి తక్కువ 2-వీలర్ ఫైనాన్సింగ్ వడ్డీ రేటు ఉంటుంది. అంటే ఇప్పుడు వినియోగదారులు EMI వడ్డీ రేటు విషయంలో రూ. 12,000 వరకు ఆదా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డులతో బెస్ట్ EMI డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

వివిధ బ్యాంకులు క్రెడిట్ కార్డులతో రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి. ఏథర్ లోన్ స్కీమ్స్‌పై జీరో డౌన్ పేమెంట్, రూ.2,739 నుంచి ప్రారంభమయ్యే EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. 12 నుంచి 60 నెలల టెన్యూర్‌తో ఈ స్కీమ్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఏథర్ బ్రాండ్‌ నుంచి ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫ్లాగ్‌షిప్ స్కూటర్ 450X. ఇది 2.9kWh, 3.7kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 90kmph వేగంతో 150కిమీల సర్టిఫైడ్ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. పార్క్ అసిస్ట్, ఆటో హోల్డ్, ఫాల్ సేఫ్ ఫంక్షన్, గూగుల్ మ్యాప్స్‌తో ఇంటిగ్రేట్ అయిన 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్.. వంటివి ఇ-స్కూటర్ ఫీచర్లు. ఏథర్ లేటెస్ట్ ఈవీ 450S. ఇది 115కిమీ సర్టిఫైడ్ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 90కిమీ. డీప్ వ్యూ డిస్‌ప్లే, ఫాల్ సేఫ్ ఫంక్షన్, పార్క్ అసిస్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ కోస్టింగ్ రీజెన్‌ వంటి స్పెసిఫికేషన్లతో వెహికల్ లాంచ్ అయింది. పొందుతుంది.

Also Read:  Most Deleted App : 2023లో ఎక్కువమంది డిలీట్ చేసిన యాప్స్ ఇవే..