Site icon HashtagU Telugu

Hero Splendor Plus Bike: బంపర్ ఆఫర్.. రూ.20 వేలకే Splendor Plus బైక్

Bumper Offer.. Hero Splendor Plus Bike For Rs. 20 Thousand

Bumper Offer.. Splendor Plus Bike For Rs. 20 Thousand

ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకిన విషయం తెలిసిందే. పెట్రోల్ ఆదా చేసుకోవాలనుకునే వారు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే బైక్స్ ను కొనుగోలు చేస్తున్నారు. మీరు హీరో స్ప్లెండర్ ప్లస్‌ ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. మంచి అవకాశం ఉంది. హీరో మోటోకార్ప్ యొక్క స్ప్లెండర్ బైక్‌కు కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. 100 CC ఇంజన్ తో కూడిన ఈ బైక్ అతి తక్కువ ధరకే లభ్యం కావడంతో కస్టమర్లు సైతం కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. తక్కువ ధరతో పాటు.. ఈ బైక్స్ అధిక మైలేజీని ఇస్తుంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకిన విషయం తెలిసిందే. పెట్రోల్ ఆదా చేసుకోవాలనుకునే వారు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే బైక్స్ ను కొనుగోలు చేస్తున్నారు. మీరు Hero Splendor Plus ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. మంచి అవకాశం ఉంది.

ఈ బైక్ ఎక్స్ – షోరూమ్ ధర రూ.76,346 గా ఉంది. ఒక వేల మీరు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాలనుకుకోకుంటే.. మీరు సెకండ్ హ్యాండ్ మోడల్‌ను కూడా పరిగణించవచ్చు. వీటికి ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుంది. వీటిని ఆయా ఫైనాన్స్ సంస్థలు ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఇక హీరో స్ప్లెండర్ ప్లస్ రూ. 20 వేల బడ్జెట్‌లో బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. హీరో స్ప్లెండర్ ప్లస్ సెకండ్ హ్యాండ్ మోడల్‌పై అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం. Hero Splendor Plus యొక్క పాత మోడల్ DROOM సైట్‌లో చాలా చౌకగా అందుబాటులో ఉంది. 2014 మోడల్ సైట్‌లో కేవలం రూ.25,000కే అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను కొనుగోలు చేయడానికి ఫైనాన్స్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. తక్కువ డౌన్ పేమెంట్ కట్టి.. మిగిలిన అమౌంట్ ను EMI రూపంలో చెల్లించవచ్చు.

Hero Splendor Plus యొక్క సెకండ్ హ్యాండ్ మోడల్ QUIKR వెబ్‌ సైట్‌లో కూడా చాల తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. 2015 మోడల్ బైక్ సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ సెకండ్ హ్యాండ్ మోడల్ కేవలం 30 వేల రూపాయలకే లభిస్తుంది. అయితే.. దీనిపై ఎలాంటి ఆర్థిక ప్రణాళిక అందుబాటులో లేదు. అంటే ఎలాంటి ఈఎంఐ ఆప్షన్స్ లేవు. ఇక సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ కు సుపరిచితమైన సైట్ ఓఎల్ఎక్స్. మీరు OLX వెబ్‌సైట్ నుండి సెకండ్ హ్యాండ్ Hero Splendor Plus తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 2012 మోడల్ bike ఈ సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. దీని ధర కేవలం రూ.20,000.

ఇక బైక్ యొక్క సెకండ్ హ్యాండ్ మోడల్‌ను కొనుగోలు చేసే ముందు.. బైక్ యొక్క కండీషన్ మరియు డాక్యుమెంట్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసి కొనుగోలు చేయండి. అలాగే.. మీరు కొత్త మోడల్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు డౌన్ పేమెంట్‌తో బైక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. మిగిలిన అమౌంట్ ఈఎంఐ రూపంలో చెల్లించేందుకు చాలా ఫైనాన్స్ కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి.

Also Read:  Snoring Tips: గురకతో ఇబ్బంది పడుతున్నారా?