Site icon HashtagU Telugu

Budget Bikes: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న బడ్జెట్ బైక్స్?

Mixcollage 04 Feb 2024 03 07 Pm 2952

Mixcollage 04 Feb 2024 03 07 Pm 2952

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో బైక్ అన్నది తప్పనిసరి. కొంచెం పెద్ద కుటుంబం అయితే ఇంట్లో కనీసం నాలుగైదు బైకులను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఇదివరకటి రోజుల్లో కేవలం సైకిల్పై ఎక్కువగా ఆధారపడిన వారు ప్రస్తుతం పూర్తిగా బైక్స్ పై ఆధారపడుతున్నారు. చిన్న చిన్న దూరాలకు కూడా బైక్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ బైక్స్‌ డిమాండ్‌ పెరిగింది. హీరో, హోండా, టీవీఎస్‌, బజాజ్‌తో సహా అనేక ద్విచక్ర వాహన తయారీదారుల నుండి 150 సీసీ విభాగంలో అనేక తక్కువ మెయింటెనెన్స్ బైక్‌లు అందిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో బడ్జెట్ ధరకే ఆకట్టుకుంటున్న ఐదు రకాల బైక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

97.2 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌తో ఆధారితమైన హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యంత సరసమైన బైక్‌లలో ఒకటి. ఈ మోటార్‌సైకిల్ నిర్వహణ వ్యయం రెండేళ్లకు దాదాపు రూ.2,750గా అంచనా వేస్తున్నారు. హీరో స్ప్లెండర్‌ ధరలు రూ. 74,835 నుంచి రూ. 76,075 మధ్య ఉన్నాయి. అలాగే హోండా షైన్ బైక్ రూ. 64,900 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. హోండా షైన్ 100లో 7.2 హెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 98.98 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. 2 సంవత్సరాలలో హోండా షైన్ 100కు సంబంధించిన అంచనా నిర్వహణ వ్యయం సుమారు రూ. 4,500గా ఉంది.

అలాగే టీవీఎస్‌ స్టార్ సిటీ ప్లస్ 110 సీసీ, బీఎస్‌6 ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 8 హెచ్‌పీ శక్తిని, 8.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 77,770 నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా బజాజ్ పల్సర్ 125 124.4 సీసీ డీటీఎస్‌-ఐ ఇంజిన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది 11.6 హెచ్‌పీ శక్తిని, 10.8 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ పల్సర్ 125 ధర రూ. 91,750 నుంచి ప్రారంభమవుతుంది. బజాజ్ పల్సర్ 125కు సంబంధించిన అంచనా నిర్వహణ వ్యయం 3 సంవత్సరాలకు రూ. 3,390గా ఉంటుంది. అలాగే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 97.2 సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఇ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ.62,862 నుంచి రూ.70,012 వరకు ఉంది. హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌కు సంబంధించిన అంచనా నిర్వహణ వ్యయం 2 సంవత్సరాలకు సుమారు రూ. 2,500గా ఉంది.